Barley Laddu : బార్లీ గింజలతో రుచికరమైన, ఆరోగ్యకరమైన లడ్డూలు.. తయారీ ఇలా..!

Barley Laddu : తృణధాన్యాల్లో ఒకటైన బార్లీ గింజల గురించి అందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజూ తాగుతుంటే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. బార్లీ గింజలను వండుకుని తింటే ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది. ఇలా బార్లీ గింజలతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ గింజలను పొడి చేసి దాంతో లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. వీటిని తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే బార్లీ గింజలతో ఆరోగ్యవంతమైన లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బార్లీ లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..

బార్లీ గింజలు, చక్కెర – ఒక్కో కప్పు చొప్పున, వేడి చేసి చల్లార్చిన పాలు – పావు కప్పు, నెయ్యి – రెండు టీస్పూన్లు, జీడిపప్పు, కిస్మిస్‌ – పావు కప్పు, యాలకుల పొడి – పావు టీస్పూన్‌.

Barley Laddu recipe in telugu make in this way
Barley Laddu

బార్లీ లడ్డూలను తయారు చేసే విధానం..

బార్లీ గింజలను దోరగా వేయించి తీసి చల్లారనివ్వాలి. తరువాత బార్లీ గింజలతోపాటు చక్కెర కలిపి మిక్సీలో వేసి పొడి చేయాలి. దీన్ని జల్లెడ పట్టాలి. ఇప్పుడు నెయ్యి కాగబెట్టుకుని జీడిపప్పు ముక్కలు, కిస్మిస్‌ వేయించి అందులోనే బార్లీ మిశ్రమం, యాలకుల పొడి, పాలు కూడా వేసి బాగా కలిపి లడ్డూలలా చుట్టుకోవాలి. ఈ మిశ్రమం పొడిగా అనిపిస్తే మరిన్ని పాలు కలుపుకోవచ్చు. దీంతో ఎంతో రుచికరమైన బార్లీ లడ్డూలు తయారవుతాయి. వీటిని రోజుకు ఒకటి తిన్నా చాలు, ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఎన్నో పోషకాలు లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. ఈ లడ్డూలను అందరూ ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts