Green Mango Curry : మామిడికాయలతో ఎంతో రుచిగా ఉండే కూరను చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?

Green Mango Curry : వేసవి సీజన్‌.. ఎటు చూసినా మామిడికాయలు మనకు విరివిగా లభిస్తున్నాయి. ఎన్నో రకాల మామిడికాయ వెరైటీలను అందరూ ఆస్వాదిస్తున్నారు. ఇక చాలా మంది పచ్చళ్లను పెట్టుకోవడంలోనూ బిజీ అయ్యారు. మరోవైపు పుల్లని పచ్చి మామిడికాయలతో చాలా మంది పప్పు, ఒరుగులు, రసం, పులిహోర వంటివి చేసుకుని తింటున్నారు. అయితే ఈ కాయలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా చేయవచ్చు. దీన్ని చేయడం ఎంతో సులభం. ఈ కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడికాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..

మామిడికాయలు – నాలుగు, నూనె – ఒక టేబుల్‌ స్పూన్‌, ఆవాలు – ఒక టీస్పూన్‌, జీలకర్ర – ఒక టీస్పూన్‌, కరివేపాకు – రెండు రెబ్బలు, యాలకులు – రెండు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, ఉల్లిపాయ – ఒకటి, పసుపు – ఒక టీస్పూన్‌, కారం – ఒక టీస్పూన్‌, కూర కారం – ఒక టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – ఒక టీస్పూన్‌, తాజా కొబ్బరి – అర కప్పు, ధనియాలు – ఒక టేబుల్‌ స్పూన్‌, ఎండు మిర్చి – రెండు, చక్కెర – ఒక టీస్పూన్‌, ఉప్పు – తగినంత.

Green Mango Curry recipe in telugu very tasty make in this way
Green Mango Curry

మామిడికాయ కూరను తయారు చేసే విధానం..

మామిడికాయల చెక్కు తీసి ముక్కలుగా కట్‌ చేయాలి. కొబ్బరి, ధనియాలు, ఎండు మిర్చి మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. అనంతరం పసుపు, కారం, కూరకారం వేసి కలపాలి. అల్లం వెల్లుల్లిని కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాక మామిడికాయ ముక్కలను వేసి కలిపి కప్పు నీళ్లు పోసి సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు కొబ్బరి మిశ్రమం, చక్కెర, ఉప్పు వేసి కలిపి సిమ్‌లో పెట్టాలి. కూర దగ్గరకు అయ్యే వరకు ఉడికించాలి. అంతే.. ఎంతో రుచికరమైన మామిడికాయ కూర రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఈసారి పచ్చి మామిడికాయలను తెస్తే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అందరూ ఎంతో ఇష్టపడతారు. మళ్లీ కావాలని అడుగుతారు.

Editor

Recent Posts