Beerakaya Pappu : బీర‌కాయ ప‌ప్పును ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..

Beerakaya Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ‌లు ఒక‌టి. బీర‌కాయ‌ల్లో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. బీర‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి కూడా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. శ‌రీరంలో వేడిని త‌గ్గించ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగున‌ర‌చ‌డంలో కూడా బీర‌కాయ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. బీరకాయ‌ల‌తో ఎక్కువ‌గా మ‌నం బీర‌కాయ ప‌ప్పును త‌యారు చేస్తూ ఉంటాం. బీరకాయ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ప‌ప్పును ఇష్టంగా తింటారు. బీర‌కాయ ప‌ప్పును రుచిగా, చ‌క్క‌గా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీర‌కాయ ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బీర‌కాయ‌లు – పావు కిలో, కందిప‌ప్పు – 150 గ్రా., త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నాన‌బెట్టిన చింత‌పండు – రెండు రెమ్మ‌లు, నూనె – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Beerakaya Pappu recipe in telugu this is the way to make
Beerakaya Pappu

బీర‌కాయ పప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత రెండు గ్లాసుల నీటిని పోయాలి. ఇందులో బీర‌కాయ ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి మూత పెట్టాలి. వీటిని 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ‌ మంట‌పై ఉడికించాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, చింత‌పండు ర‌సం వేసి ఉండ‌లు లేకుండా క‌ల‌పాలి. ఈ ప‌ప్పును మ‌ర‌లా స్ట‌వ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి, తాళింపు దినుసులు, ఇంగువ‌, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి.

తాళింపు వేగిన త‌రువాత ముందుగా త‌యారు చేసిన ప‌ప్పును వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బీర‌కాయ‌ల‌తో ఈ విధంగా ప‌ప్పును చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts