Besan Dhokla : శ‌న‌గ‌పిండితో ఒక‌సారి ఈ వంట‌కం చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Besan Dhokla : మ‌నం శ‌న‌గ‌పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌లు, చిరుతిళ్లను త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో డోక్లా కూడా ఒక‌టి. ఆవిరి మీద ఉడికించి చేసే ఈ డోక్లాను చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉండే ఈ డోక్లాను ఎవ‌రైనా చాలా తేలిక‌గా, అర‌గంటలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ బేస‌న్ డోక్లాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బేస‌న్ డోక్లా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడ‌ర్ లేదా ఈనో – ఒక టీస్పూన్.

Besan Dhokla recipe in telugu make in this method
Besan Dhokla

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – అర టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, గాట్లు పెట్టిన ప‌చ్చిమిర్చి – 5, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నీళ్లు -ముప్పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, పంచ‌దార – ఒక టేబుల్ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

బేస‌న్ డోక్లా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండి, ప‌సుపు, ఉప్పును తీసుకోవాలి. త‌రువాత ఇందులో అర క‌ప్పు కంటే కొద్దిగా ఎక్కువ నీటిని పోసి ఉండలు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిని 15 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని పోసి అందులో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి నీటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగే లోపు బేకింగ్ ట్రేను లేదా వెడ‌ల్పుగా ఉండే గిన్నెను తీసుకుని దాని అంచుల‌కు నూనె రాసుకోవాలి. ఇప్పుడు ముందుగా క‌లిపిన పిండిలో నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో ఇనో లేదా బేకింగ్ పౌడ‌ర్ వేసి దానిపై కొద్దిగా నీటిని పోసి పిండి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండిని ట్రేలో పోసి త‌ట్టాలి. ఇప్పుడు ఈ ట్రేను ముందుగా సిద్దం చేసుకున్న స్టాండ్ పై ఉంచి మూత పెట్టి ఆవిరిపై ఉడికించాలి.

దీనిని 10 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి మ‌రో 15 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ట్రేను బ‌య‌ట‌కు తీసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత డోక్లాను ప్లేట్ లోకి తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత నీళ్లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత పంచ‌దార వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని డోక్లాపై వేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే డోక్లా తయార‌వుతుంది. స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. శ‌న‌గ‌పిండితో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts