Bhimla Nayak : దుమ్ము లేపుతున్న భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్‌.. ప‌వ‌న్ విశ్వ‌రూపం చూపించారు..!

Bhimla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా, నిత్య మీన‌న్ హీరోయిన్‌గా తెర‌కెక్కిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీ ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయాల‌ని ఫిక్స్ చేశారు. అయితే సోమ‌వారం ప్రీ రిలీజ్ వేడుక‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. కానీ వీలు కాలేదు. అయిన‌ప్ప‌టికీ చిత్ర యూనిట్ ట్రైల‌ర్‌ను మాత్రం విడుద‌ల చేసింది. ఇక ఈ ట్రైల‌ర్ ప‌వ‌న్ ఫ్యాన్స్‌లో పూన‌కాల‌ను తెప్పిస్తోంది.

Bhimla Nayak trailer is fantastic treat for fans
Bhimla Nayak

భీమ్లా నాయ‌క్ చిత్రంలో ప‌వ‌న్‌తోపాటు రానా ముఖ్య పాత్ర‌లో న‌టించారు. ప‌వ‌న్ ప‌క్క‌న నిత్య మీన‌న్ న‌టించ‌గా.. రానాతో క‌లిసి సంయుక్త మీన‌న్ న‌టించింది. మ‌ళ‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఈ మూవీ ట్రైల‌ర్ కాసేప‌టి క్రిత‌మే విడుద‌లైంది. ఈ క్ర‌మంలోనే ఈ ట్రైల‌ర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

భీమ్లా నాయ‌క్ చిత్రం కోసం ప్రీ రిలీజ్ వేడుక‌ను అట్టహాసంగా నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. అందుకు మంత్రి కేటీఆర్‌ను కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కానీ ఏపీ మంత్రి గౌత‌మ్ రెడ్డి క‌న్నుమూయ‌డంతో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌ను ర‌ద్దు చేశారు. ఈ వేడుక‌లో ట్రైల‌ర్‌ను లాంచ్ చేద్దామ‌నుకున్నారు. కానీ వేడుక ర‌ద్ద‌యిన‌ప్ప‌టికీ మేక‌ర్స్ మాత్రం ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. ఈ క్ర‌మంలోనే భీమ్లా నాయ‌క్ గా ప‌వ‌న్ విశ్వ‌రూపం చూపించారు. ట్రైల‌ర్ ను చూస్తే సినిమా హిట్ ప‌క్కా.. అని స్ప‌ష్ట‌మవుతోంది.

Editor

Recent Posts