OTT : ఈ వారం ఓటీటీల్లో విడుద‌ల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

OTT : వారం మారిందంటే చాలు.. ప్రేక్ష‌కులు ఓటీటీల్లో ఏయే మూవీలు విడుద‌ల‌వుతున్నాయా.. అంటూ ఎదురు చూస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఈ వారం కూడా ప‌లు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. మ‌రి వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

movies releasing this week on OTT series also
OTT

హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌద‌రిలు న‌టించిన కామెడీ డ్రామా సినిమా సెహ‌రి ఈ వారం ఓటీటీలో రానుంది. ఆహా ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ఈ నెల 25వ తేదీన స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా ఫిబ్ర‌వరి 11న విడుద‌ల కాగా కేవలం రెండు వారాల్లోనే ఓటీటీల్లోకి వ‌స్తుండ‌డం విశేషం.

మ‌ళ‌యాళం బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా దృశ్యం 2కు రీమేక్‌గా దృశ్య 2 ను తెర‌కెక్కించారు. ఇది క‌న్న‌డ సినిమా. జీ5 యాప్‌లో ఈనెల 25వ తేదీన స్ట్రీమ్ కానుంది.

మ‌ళయాళంలో తెర‌కెక్కిన అజ‌గ‌జంత‌రం అనే సినిమా ఈ నెల 25వ తేదీన స్ట్రీమ్ కానుంది. సోనీ లివ్‌లో ఈ మూవీని ప్ర‌సారం చేస్తారు. యాక్ష‌న్ డ్రామాగా దీన్ని తెర‌కెక్కించారు.

ల‌వ్ హాస్ట‌ల్ అనే హిందీ మూవీ ఈ వారం స్ట్రీమ్ కానుంది. ఈ నెల 25న జీ5లో స్ట్రీమ్ అవుతుంది.

ఇక కంగ‌నా ర‌నౌత్ హోస్ట్ గా నిర్వ‌హించ‌నున్న లాక్ అప్ అనే టీవీ షో ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. దీన్ని ఎంఎక్స్ ప్లేయ‌ర్‌, ఆల్ట్ బాలాజీలో స్ట్రీమ్ చేయ‌నున్నారు.

Editor

Recent Posts