Bigg Boss : బిగ్ బాస్ నాన్‌స్టాప్.. మొద‌టి వారం ఎలిమినేట్‌ అయిన ముమైత్ ఖాన్ ..!

Bigg Boss : బుల్లితెర‌పై హిట్ అయిన బిగ్ బాస్ షోను చూసి దాన్ని ఓటీటీ రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ఈ షో ప్రారంభ‌మైంది. అయితే ఈ షో ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా న‌డ‌వ‌క‌ముందే ఫుల్‌స్టాప్ ప‌డింది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌లో ఈ షోను రోజుకు 24 గంట‌లూ లైవ్ స్ట్రీమ్ చేస్తామ‌ని చెప్పారు. కానీ సాంకేతిక కార‌ణాల‌తోపాటు షోకు వీక్ష‌కులు క‌రువు అవ‌డం చేత‌.. దీన్ని లైవ్ స్ట్రీమ్ చేయ‌డం లేదు. ఎపిసోడ్స్ రూపంలో విడుద‌ల చేస్తున్నారు.

Bigg Boss Non Stop Mumaith Khan eliminated first week
Bigg Boss

బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో మొత్తం 17 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. ఇక మొద‌టి వారం ముమైత్ ఖాన్ హౌస్ నుంచి బ‌య‌టకు వ‌చ్చింది. ఆదివారం రాత్రి రాబోయే ఎపిసోడ్‌లో ఈమె హౌస్ నుంచి బ‌య‌ట‌కు రానుంది. అయితే ఈమె హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు లీకు వీరుల ద్వారా క‌న్‌ఫామ్ అయింది.

ముమైత్ ఖాన్ ఈ వారం టాస్కుల్లో ఎక్కువ‌గా పాల్గొన‌లేదు. అలాగే ఈమె ఆర్‌జే చైతూతో క‌లిసి సిగరెట్ల కోసం వాద‌న పెట్టుకుంది. దీనికి తోడు మిగితా కంటెస్టెంట్ల‌తో పోలిస్తే ఈమెకు ఓట్లు కూడా త‌క్కువ‌గానే వ‌చ్చాయ‌ట‌. అందుక‌నే ఈమె ఈవారం హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ వారం మొత్తం 7 మంది నామినేష‌న్స్‌లో నిలిచారు. అయినా త‌క్కువ ఓట్ల కార‌ణంగానే ముమైత్ ఖాన్ నిష్క్ర‌మిస్తుంద‌ని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ అస‌లు సీజ‌న్‌లోనూ ముమైత్ ఖాన్ ఎక్కువ రోజుల పాటు ఉండ‌లేదు. త్వ‌ర‌గానే ఈమె బ‌య‌ట‌కు వ‌చ్చంది. ఇప్పుడు కూడా అలాగే జ‌ర‌గ‌డం విశేషం.

Editor

Recent Posts