Cauliflower : కాలిఫ్ల‌వ‌ర్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయండి..!

Cauliflower : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో కాలిఫ్ల‌వ‌ర్ ఒక‌టి. దీన్ని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఇందులో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు కాలిఫ్ల‌వ‌ర్‌లో అధికంగా ఉంటాయి. ఇవి మ‌న‌కు శ‌క్తిని అందిస్తాయి. అయితే కాలిఫ్ల‌వ‌ర్‌ను సరిగ్గా నిల్వ చేయాలేకానీ.. ఇది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. తాజాగా ఉంటుంది. దాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచి ఉప‌యోగించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

how to store Cauliflower for so many days fresh
Cauliflower

ముందుగా కాలిఫ్ల‌వ‌ర్‌ను ఆకుప‌చ్చ బాగం, వెనుక భాగం మొత్తం తీసేసి పువ్వును చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. త‌రువాత ఒక పాత్ర తీసుకుని అందులో నీరు పోసి కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి బాగా క‌లిపాక ఆ నీటిలో కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేయాలి. అన్నీ పూర్తిగా మునిగేలా చూడాలి. త‌రువాత కాలిఫ్ల‌వ‌ర్‌ను బ‌య‌ట‌కు తీసి మ‌ళ్లీ ఒక పాత్ర‌లో వేసి అందులో నీరు పోయాలి. కాలిఫ్ల‌వ‌ర్ ముక్కలు అన్నీ మునిగేలా చూడాలి. ఆ పాత్ర‌ను స్ట‌వ్ మీద పెట్టి కాలిఫ్ల‌వ‌ర్‌ను 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించాలి. అనంత‌రం దింపేయాలి.

త‌రువాత కాలిఫ్ల‌వ‌ర్‌ను చ‌ల్లార్చాలి. మళ్లీ ఇంకొక పాత్ర తీసుకుని అందులో ఐస్ వాట‌ర్ ను పోయాలి. అందులో మళ్లీ కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేయాలి. ముక్క‌లు పూర్తిగా మునిగేలా చూడాలి. అనంత‌రం 6 లేదా 7 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత కాలిఫ్ల‌వ‌ర్‌ను బ‌య‌ట‌కు తీయాలి. మొత్తం కాలిఫ్ల‌వ‌ర్‌ను బ‌య‌ట‌కు తీశాక అందులో నీళ్లు లేకుండా చూసుకోవాలి. కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల్లో నీళ్లు లేకుండా మొత్తం బ‌య‌ట‌కు పంపాలి. త‌రువాత ఆ కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను ఒక జిప్ లాక్ బ్యాగ్‌లో వేయాలి. బ్యాగ్ వ‌దులుగా ఉండాలి. అందులో కాలిఫ్ల‌వ‌ర్‌ను వేశాక సీల్ చేయాలి. జిప్ పెట్టేసి ఆ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా కాలిఫ్ల‌వ‌ర్‌ను ఆ బ్యాగ్‌లో పెడితే చాలా రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటుంది. అలాగే దాన్ని వండ‌ద‌ల‌చిన‌ప్పుడు త్వ‌ర‌గా ఉడుకుతుంది. ఎందుకంటే ముందే కొంత ఉడికింది కాబ‌ట్టి.. ఆ త‌రువాత ఎక్కువ సేపు ఉడ‌క‌బెట్టాల్సిన ప‌నిలేదు.

ఇక ఇలా స్టోర్ చేసిన బ్యాగ్‌ను మళ్లీ మళ్లీ ఓపెన్ చేయ‌రాదు. ఎప్పుడైతే వాడుతాము.. వండుకుంటాము.. అనుకుంటారో అప్పుడు ఆ బ్యాగ్‌ను తీసి అందులోని కాలిఫ్ల‌వ‌ర్‌ను బ‌య‌ట ఉంచి దాంతో వంట చేయాలి. అంతేకానీ.. స్టోర్ చేసిన బ్యాగ్‌ను మాటి మాటికీ ఓపెన్ చేయ‌రాదు. చేస్తే కాలిఫ్ల‌వ‌ర్ పాడవుతుంది. ఇలా కాలిఫ్ల‌వ‌ర్‌ను ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచ‌వ‌చ్చు.

Admin

Recent Posts