Bigg Boss OTT Telugu : బుల్లితెరపై అత్యంత సక్సెస్ అయిన రియాలిటీ షో ఏదంటే.. బిగ్ బాస్ అని ఠక్కున చెబుతారు. అనేక భాషల్లో బిగ్ బాస్ ప్రసారమవుతోంది. అయితే ఇటీవలి కాలంలో బిగ్ బాస్ ఓటీటీ అని చెప్పి ఓ సరికొత్త షోను ప్రారంభించారు. తెలుగులోనూ ఈ రియాలిటీ షో నడుస్తోంది. కానీ ఈ షోకు అసలు ఆదరణ లభించడం లేదు. టీవీలో గతంలో వచ్చిన బిగ్ బాస్ సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ ఓటీటీకి అసలు ప్రేక్షకులు కరువయ్యారు. అసలు ఇలాంటి షో ఒకటి నడుస్తుందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అయితే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో ఇంత దారుణంగా ఫెయిల్ అయ్యేందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేమిటంటే..
బిగ్ బాస్ ఓటీటీని అనౌన్స్ చేయగానే.. దీన్ని రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్‌లో చూడొచ్చని చెప్పారు. సాధారణంగా రోజుకు ఈ షోను 2 గంటల పాటు చూడడమే ఎక్కువ. అలాంటిది రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ చేస్తే దీన్ని ఎవరు చూస్తారు ? అందుకనే సగం ఇంట్రెస్ట్ మొత్తం అక్కడే పోయింది. ఎపిసోడ్స్ లాగా ప్రసారం చేస్తే ఆసక్తి ఉంటుంది. కానీ లైవ్ స్ట్రీమ్ చూడలేం. అందుకనే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ పోయింది. ఈ షో ఫ్లాప్ అవడం వెనుక ఉన్న కారణాల్లో ఇదొకటని చెప్పవచ్చు.
ఇక ఈ షోలో కొందరు కొత్తవాళ్లు ఉన్నారు.. కొందరు పాతవారు ఉన్నారు. పాతవాళ్లను ఇప్పటికే బిగ్ బాస్ షోలలో చూశారు. కనుక వాళ్లనే మళ్లీ తెస్తే పెద్దగా ఆసక్తి ఉండదు. కనుక షో మొత్తం కొత్తవాళ్లను పెట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఈ షో ఇందుకే ఫెయిల్ అయిందని అంటున్నారు.
బిగ్ బాస్ ఓటీటీకి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈయన మీద ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కంప్లెయింట్ చేస్తున్నారు. సీజన్ కు సీజన్‌కు హోస్ట్‌ను మారిస్తే బాగుంటుంది కదా.. ఇంకా ఈయననే ఎందుకు హోస్ట్‌గా తీసుకుంటున్నారు ? అని ఇది వరకే అన్నారు. ఇక మళ్లీ ఓటీటీకి కూడా ఆయననే హోస్ట్‌గా ఉన్నారు. ఇది ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకనే ఈ ఓటీటీ షోపై ఆసక్తి మొత్తం తగ్గిపోయింది. దీన్ని చూసే వారు కరువయ్యారు.
గతంలో బిగ్ బాస్ షోలకు ఆసక్తికరమైన ప్రోమోలను విడుదల చేశారు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. ఓటీటీ షో కోసం విడుదల చేస్తున్న ప్రోమోలు ఏమాత్రం ఆసక్తిని కలిగించడం లేదు. దీంతో ఈ షోపై సహజంగానే ఇంట్రెస్ట్ మొత్తం పోయింది.
ఇక బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో కేవలం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లోనే ప్రసారం అవుతోంది. దీన్ని చూడాలంటే హాట్ స్టార్ అకౌంట్ ఉండాలి. ఇది చాలా మందికి ఉండదు. ఏడాదికి రూ.1499 చెల్లించే స్థోమత చాలా మందికి ఉండదు. కనుక ఈ యాప్‌ను వాడేవారు తక్కువగానే ఉంటారు. పైగా కేవలం యాప్‌లోనే ప్రసారం అవుతుంది కనుక మొబైల్ ఇంటర్నెట్ డేటా ఎక్కువగా ఉండాలి. వైఫై వాడేవారు తక్కువగా ఉంటారు. కనుక ఈ షోను చూస్తే రోజుకు లభించే ఆ 1 లేదా 2 జీబీ డేటా మొత్తం అయిపోతుంది. కనుక ఈ షోను వీక్షకులు చూడడం లేదు.
ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో ఫ్లాప్ అయిందని.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం చెందిందని చెప్పవచ్చు. మరి బిగ్ బాస్ సీజన్ 6ను అయినా సమర్థవంతంగా నిర్వహిస్తారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.