Viral Video : పాములు ఆడించేవాళ్లు బూర ఊదుతుంటే పాములు లయబద్దంగా నాట్యం చేస్తాయి. ఇలాంటి సంఘటనలను మనం ఇది వరకు ఎన్నింటినో చూశాం. సోషల్ మీడియాలోనూ ఇలాంటి ఘటనలకు చెందిన వీడియోలను చాలానే చూశాం. అయితే పాములు ఆడించేవాళ్లు బూర ఊదితే.. ఒక మనిషి నాట్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా ? లేదు కదా.. సహజంగా ఇలాంటి సీన్లను సినిమాల్లోనే పెడతారు. కానీ రియల్‌గా కూడా ఇలాంటి ఫన్నీ సంఘటనలు ఎప్పుడో ఒకసారి జరుగుతూనే ఉంటాయి. తాజాగా కూడా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది.
పాములాడించే ఓ వ్యక్తి బూర పట్టుకుని ఓ షాపు వద్దకు వచ్చాడు. అయితే అతను బూర ఊదుతుంటే ఆ షాపులోంచి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. అది కూడా నాగినిలా డ్యాన్స్ చేస్తూ వచ్చి బూర ఊదే అతన్ని కాటు వేసినట్లు వేయబోయాడు. దీంతో బూర ఊదుతున్న ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
కాగా సోషల్ మీడియాలో ఈ ఫన్నీ సంఘటన వీడియో వైరల్‌గా మారింది. ఎంతో మంది ఇప్పటికే ఈ వీడియోను వీక్షించారు. చాలా మందికి ఇది ఎంతగానో నవ్వు తెప్పిస్తోంది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.