Ulcer Natural Remedies : జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే అల్స‌ర్ ల‌ను త‌గ్గించేందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

Ulcer Natural Remedies : మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఉండే భాగాల్లో జీర్ణాశ‌యం, చిన్న పేగులు, పెద్ద పేగులు ముఖ్య‌మైన‌వి. అయితే మ‌నం తినే ఆహారం, పాటించే అల‌వాట్లు, వాడే మందులు.. ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఇవి వాపుల‌కు గుర‌వుతుంటాయి. అలాగే పుండ్లు ఏర్ప‌డుతుంటాయి. వీటినే అల్స‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. పెద్ద‌పేగులో అల్స‌ర్ వ‌స్తే దాన్ని అల్స‌రేటివ్ కొలైటిస్ అంటారు. అయితే అల్స‌ర్లు ఏర్ప‌డిన వారిలో క‌డుపులో మంట కామ‌న్‌గా క‌నిపించే ల‌క్ష‌ణం. దీంతోపాటు ప‌లు ఇత‌ర ల‌క్ష‌ణాలు కూడా మ‌న‌కు క‌నిపిస్తుంటాయి. అవేమిటంటే..

Ulcer Natural Remedies you should definitely follow
Ulcer Natural Remedies

అల్స‌ర్లు వ‌చ్చిన వారిలో తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుంది. ర‌క్తం, చీముతో కూడిన విరేచ‌నాలు అవుతుంటాయి. అధిక బ‌రువు స‌డెన్‌గా త‌గ్గుతారు. మ‌ల‌విస‌ర్జ‌న చేయ‌బుద్ది కాదు. క‌ష్టంగా ఉంటుంది. మ‌ల విస‌ర్జ‌న చేసేట‌ప్పుడు ర‌క్తం వ‌స్తుంది. క‌డుపులో నొప్పిగా, ప‌ట్టేసిన‌ట్లు ఉంటుంది. మ‌లద్వారం వ‌ద్ద కూడా మంట‌, నొప్పి ఉంటాయి. శ‌రీరంలో నీర‌సంగా ఉంటుంది. చ‌ర్మంపై ద‌ద్దుర్లు వ‌స్తాయి. నోట్లో పూత ఉంటుంది. పుండ్లు ఏర్ప‌డుతాయి. లివ‌ర్ వ్యాధులు వ‌స్తాయి. మ‌లంలో మ్యూక‌స్ లేదా చీము ప‌డుతుంది. ఇలా అల్స‌ర్లు వ‌చ్చిన వారిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి.

ఇక అల్స‌ర్లు వ‌చ్చిన వారు కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

1. నిత్యం యోగా, మెడిటేష‌న్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరంపై ప‌డే ఒత్తిడి త‌గ్గుతుంది. మానసిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. ఒత్తిడి మూలంగా కూడా అల్స‌ర్లు వ‌స్తాయి. క‌నుక యోగా, మెడిటేష‌న్ రోజూ చేస్తే ఒత్తిడి త‌గ్గుతుంది. దీంతో అల్స‌ర్లు త్వ‌ర‌గా న‌య‌మ‌వుతాయి.

2. హెర్బ‌ల్ టీల‌ను రోజూ క‌నీసం 2 నుంచి 3 సార్లు తాగాలి. వీటిల్లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. క‌నుక అల్స‌ర్లు న‌య‌మ‌వుతాయి. అలాగే ఈ టీ ల‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీంతో అల్స‌ర్లు త్వ‌ర‌గా న‌య‌మ‌వుతాయి. క‌నుక హెర్బ‌ల్ టీ ల‌ను రోజూ తాగుతుండాలి.

3. అలోవెరా (క‌ల‌బంద‌)లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. క‌నుక క‌ల‌బంద జ్యూస్‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో సేవించాలి. ఈ జ్యూస్ జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. అల్స‌ర్ల‌ను న‌యం చేస్తుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. క‌నుక రోజూ అలోవెరా జ్యూస్‌ను తాగుతుండాలి.

4. ప‌సుపులో క‌ర్‌క్యుమిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల రోజూ రాత్రి ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగాలి. దీంతో అల్స‌ర్లు న‌య‌మ‌వుతాయి.

5. అల్స‌ర్ల‌ను న‌యం చేయ‌డంలో వాల్ న‌ట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి జీర్ణాశ‌యం, పేగుల గోడ‌ల‌ను ర‌క్షిస్తాయి. దీంతో వాటిపై ఉండే పుండ్లు త‌గ్గిపోతాయి. ఫ‌లితంగా అల్స‌ర్లు న‌య‌మ‌వుతాయి. రోజూ గుప్పెడు వాల్ న‌ట్స్‌ను తింటే ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

6. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే న‌ట్స్‌, చేప‌లు, ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, ఆకుకూర‌లను ఆహారంలో భాగం చేసుకుంటే అల్స‌ర్లు త్వ‌ర‌గా న‌య‌మ‌వుతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

Share
Admin

Recent Posts