Biyyam Pindi Rotte : బియ్యం పిండి రొట్టెల‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..

Biyyam Pindi Rotte : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బియ్యం పిండితో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బియ్యం పిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో రొట్టె కూడా ఒక‌టి. ఈ వంట‌కాన్ని పూర్వ‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. బియ్యం పిండితో చేసే రొట్టె చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారి చేసే వారు కూడా దీనిని సుల‌భంగా చేసుకోవ‌చ్చు. బియ్యంపిండితో ఎంతో రుచిగా ఉండే రొట్టెను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బియ్యం పిండి రొట్టె త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం పిండి – ఒక‌టిన్న‌ర క‌ప్పు, నాన‌బెట్టిన శ‌న‌గ‌ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన క‌రివేపాకు – కొద్దిగా, నూనె – త‌గినంత‌, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – స‌రిప‌డా.

Biyyam Pindi Rotte reipe in telugu know how to make them
Biyyam Pindi Rotte

బియ్యం పిండి రొట్టెల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, శ‌న‌గ‌ప‌ప్పు, బియ్యం పిండి, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని మెత్త‌గా చెక్క‌ల పిండిలాగా క‌లుపుకోవాలి. త‌రువాత క‌రివేపాకు వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ఒక పాలిథిన్ క‌వ‌ర్ ను తీసుకుని దానికి నూనెను రాయాలి. త‌రువాత కొద్దిగా పిండిని తీసుకుని చేత్తో రొట్టెలా వ‌త్తుకోవాలి. ఈ రొట్టె మ‌రీ ప‌లుచ‌గా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా వ‌త్తుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో లేదా పెనం మీద ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. త‌రువాత దానిపై ముందుగా వ‌త్తుకున్న రొట్టెను వేసి కాల్చుకోవాలి. దీనిని చిన్న మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి రొట్టె త‌యారవుతుంది. దీనిని స్నాక్స్ గా త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. పిల్ల‌లు ఈ రొట్టెను మ‌రింత ఇష్టంగా తింటారు. బ‌య‌ట నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే బియ్యం పిండితో రొట్టెల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా చేసిన రొట్టెలు రెండు రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటాయి.

Share
D

Recent Posts