Fenugreek Seeds : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది రక్తహీనత, మోకాళ్ల నొప్పులు, షుగర్, బీపీ వంటి రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా రక్తహీనత సమస్య బారిన పడితే మనల్ని ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇటువంటి సమస్యల బారిన ఇవి జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మన శరీరంలో వాత దోషాలు ఎక్కువవడం వల్ల మనం ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. శరీరంలో తలెత్తిన ఈ వాత దోషాలను మనం సహజ సిద్దంగా కూడా తగ్గించుకోవచ్చు. వాత దోషాలను తొలగించడంలో మన వంటగదిలో ఉండే మెంతులు మనకు ఎంతగానో సహాయపడతాయి. మెంతులను మనం వివిధ రకాల వంటల్లో వాడుతూనే ఉంటాం.
మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. పెద్ద ప్రేగు క్యాన్సర్ ను నివారించే గుణం కూడా ఈ మెంతులకు ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలను నయం చేయడంలో, షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో ఈ మెంతులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా వీటిని అతిగా తీసుకోకూడదు. వీటిని కూడా ఔషధంగా తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మెంతులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలుసు కానీ వాటిని ఎలా, ఎప్పుడు ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియదు. మెంతులను ఎలా తీసుకోవాలి.. మెంతుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని పరగడుపున తాగి మెంతులను తినాలి. ఇలా నానబెట్టిన మెంతులను మనం మొలకెత్తించి కూడా తీసుకోవచ్చు. ఇలా మెంతి నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభించి రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే ఈ నీటిని తాగడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెంతులను నానబెట్టిన నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో షుగర్ నియంత్రణలో ఉంటుంది. మెంతుల నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.
దీంతో గ్యాస్, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ లతో బాధపడే వారు ఈ మెంతి నీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా మెంతి నీటిని తాగి మెంతులను తినడం వల్ల శరీరంలో వచ్చే నొప్పులు, రక్తహీనత, డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గు ముఖం పట్టడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది. థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలతో బాధపడే వారు కూడా ఈ మెంతుల నీటిని తాగుతూ మెంతులను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెంతులను తింటూ మెంతులు నానబెట్టిన నీటిని తాగడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య స్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.