viral news

వార్నీ.. సూప‌ర్ ప‌వ‌ర్స్ ఉన్నాయ‌ని బిల్డింగ్ 4వ అంతస్తు నుంచి దూకేశాడు..

ఈరోజుల్లో కొంద‌రు మ‌రీ వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఇలాంటి వారి గురించి తెలుస్తోంది. కొంద‌రు రీల్స్ పిచ్చితో చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తూ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ఇంకా కొంద‌రు ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మేం చెప్ప‌బోతున్న‌ది కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన ఓ వ్య‌క్తి గురించే. ఇంతకీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు జిల్లాలో ఉన్న క‌ర్ప‌గం ఇంజినీరింగ్ కాలేజీలో ప్ర‌భు (19) అనే యువ‌కుడు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో 3వ సంవ‌త్స‌రం విద్య‌ను అభ్య‌సిస్తూ కాలేజీకి చెందిన హాస్ట్‌లో 4వ అంత‌స్తులో ఉంటున్నాడు. అయితే ప్ర‌భు ఎల్ల‌ప్పుడూ త‌న తోటి విద్యార్థులు, స్నేహితుల‌తో త‌న‌కు అతీంద్రియ శ‌క్తులు ఉన్నాయ‌ని, సూప‌ర్ ప‌వ‌ర్స్ ఉన్న త‌న‌కు ఏం చేసినా ఏమీ కాద‌ని అంటుండేవాడు. ఈ క్ర‌మంలోనే తాను ఉంటున్న కాలేజీ హాస్ట‌ల్ భ‌వ‌నం 4వ అంత‌స్తు నుంచి స‌డెన్ గా కింద‌కు దూకేశాడు.

boy jumped from building 4th floor thought he had super powers

దీంతో ప్ర‌భు త‌ల‌, చేతులు, కాళ్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా ఈ సంఘ‌ట‌న‌తో షాక్ తిన్న తోటి విద్యార్థులు వెంట‌నే చికిత్స నిమిత్తం ప్ర‌భును స‌మీపంలోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. స్థానిక పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా ప్ర‌భు బిల్డింగ్ నుంచి కింద‌కు దూకుతున్న దృశ్యాలు అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. దీంతో ఆ దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ప్ర‌భు చేసింది చాలా త‌ప్ప‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

Admin

Recent Posts