హెల్త్ టిప్స్

రోజూ కాసేపు ఇలా చేస్తే చాలు.. హార్ట్ ఎటాక్ అస‌లు రాద‌ట‌..!

నేటి త‌రుణంలో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన పడుతున్న విష‌యం విదిత‌మే. ముఖ్యంగా అనేక మందికి అక‌స్మాత్తుగా, అనుకోకుండా హార్ట్ ఎటాక్స్ వ‌స్తున్నాయి. అందుకు కార‌ణాలు అనేకం ఉంటున్నాయి. అయితే ఒక‌ప్పుడు కేవ‌లం వ‌య‌స్సు మీద ప‌డిన వారికే గుండె జ‌బ్బులు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. యుక్త వ‌యస్సులో ఉన్న‌వారు కూడా హార్ట్ ఎటాక్స్ బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే నిత్యం 40కి పైగా పుష‌ప్స్ చేసే వారికి ఏ గుండె జ‌బ్బు రాద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నంలో తెలిసింది.

హార్వ‌ర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైంటిస్టు బృందం 10 ఏళ్ల పాటు 40 ఏళ్లు, అంత‌క‌న్నా ఎక్కువ వ‌య‌స్సు ఉన్న 1104 మంది పురుషుల‌ను ప‌రిశీలించింది. వారు నిత్యం తీసుకునే ఆహారం, చేసే ఎక్స‌ర్‌సైజ్ లు, వారికి వ‌చ్చిన గుండె స‌మ‌స్య‌ల‌ను రికార్డు చేసింది. ఈ క్ర‌మంలో తెలిసిందేమిటంటే.. నిత్యం 40 లేదా అంత‌క‌న్నా ఎక్కువ‌గా పుష‌ప్స్ చేసిన వారికి గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం 96 శాతం వ‌ర‌కు తక్కువ‌గా ఉంటుంద‌ని, అస‌లు పుష‌ప్స్ చేయ‌ని వారిలో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డ్డార‌ని సైంటిస్టులు నిర్దారించారు.

do like this daily for some time you never get heart attack

క‌నుక పై ప‌రిశోధ‌న ప్ర‌కారం.. సైంటిస్టులు చెబుతున్న‌దేమిటంటే.. ఎవ‌రైనా నిత్యం 40 లేదా అంత‌క‌న్నా ఎక్కువ‌గా పుష‌ప్స్ చేస్తే చాలు.. గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. పుష‌ప్స్ చేయ‌డం వ‌ల్ల ఛాతి, కండ‌రాల‌కు బాగా వ్యాయామం అవుతుందని, ర‌క్త సర‌ఫ‌రా పెరుగుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అందువ‌ల్లే హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయ‌ని వారు అంటున్నారు. క‌నుక నిత్యం 40 లేదా అంత‌క‌న్నా ఎక్కువ సార్లు పుష‌ప్స్ చేయండి చాలు, మీ గుండె ప‌దికాలాల పాటు ప‌దిలంగా ఉంటుంది.

Admin

Recent Posts