Broccoli Masala : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఫుడ్ ఇది.. ఎలా చేయాలంటే..?

Broccoli Masala : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌లల్లో బ్ర‌కోలి కూడా ఒక‌టి. బ్ర‌కోలి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. బ్ర‌కోలిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. గ‌ర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భ‌స్థ శిశువు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ విధంగా బ్ర‌కోలి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్ర‌కోలిని ఎక్కువ‌గా స‌లాడ్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. బ్ర‌కోలితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మసాలా కూర‌ను కూడా తయారు చేసుకోవ‌చ్చు. ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బ్ర‌కోలితో ఎంతో రుచిగా ఉండే ఈ మసాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్ర‌కోలి మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెద్ద ముక్క‌లుగా త‌రిగిన బ్ర‌కోలి – 1, ధ‌నియాలు -ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర -ఒక టీ స్పూన్, యాల‌కులు – 2, ల‌వంగాలు – 3, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌, మిరియాలు – ఒక టీ స్పూన్, ఉడికించిన ట‌మాటాలు – 3, నూనె – 4 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్, ప‌సుపు -అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, నీళ్లు – త‌గిన‌న్ని, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Broccoli Masala very healthy and tasty how to make it
Broccoli Masala

బ్ర‌కోలి మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, మిరియాలు, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. వీటిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఇదే జార్ లో ట‌మాట‌ల‌పై ఉండే పొట్టును తీసి వేసుకోవాలి. ఇప్పుడు వీట‌న్నింటిని మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బ్ర‌కోలిని వేసి వేయించాలి. వీటిని 4 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉల్లిపాయ ముక్క‌లను ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాట పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన బ్ర‌కోలి ముక్క‌లు వేసి క‌ల‌పాలి.త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మ‌రో 4 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర చల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్ర‌కోలి మ‌సాలా క‌ర్రీ త‌యారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బ్ర‌కోలితో కూర‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts