vastu

Bronze Lion Idol : ఇంట్లో సింహం విగ్ర‌హాన్ని ఇలా పెట్టుకోండి.. ఏం జ‌రుగుతుందో చెబితే న‌మ్మ‌లేరు..!

Bronze Lion Idol : ఏ ఇంట్లో నివసించే వారైనా సుఖ సంతోషాలతో జీవించాలన్నా, అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా యజమానులు కష్టపడితేనే సాధ్యమవుతుంది. దీనికి తోడు సరైన రీతిలో వాస్తు పద్ధతులను కూడా పాటిస్తే జీవితం మరింత సుఖమయమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లోని వాస్తుకు మరింత బలాన్ని చేకూర్చేందుకు ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటే సరిపోతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద సైజ్‌లో ఉన్న సింహం కాంస్య విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే అది ఇంటి అంతటికీ పాజిటివ్ ఎనర్జీని ప్రసారం చేస్తుంది. దీంతోపాటు ఇంట్లోని వారికి ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తుంది. అయితే ఆ విగ్రహాన్ని ఈశాన్య దిశగా ఉంచితే మంచిది.

కిచెన్‌లో రెండు చిన్నవైన కాంస్య పాత్రలు లేదా చిన్నవైన సింహం కాంస్య విగ్రహాలను ఆగ్నేయ దిశగా వేలాడదీస్తే ఆ ఇంట్లో శ్రేయస్సు సమృద్ధిగా ఉంటుంది. ఇంట్లో ఎల్లప్పుడూ మధ్యలో మ‌నుషులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం అవ‌స‌ర‌మైతే కంపాస్‌ను వాడాలి. ఇంటికి ప్రధాన ద్వారం నోరు వంటిది. ఇది ఇంట్లోకి శక్తిని ప్రసారం చేస్తుంది.

Bronze Lion Idol put like this in your home for luck

నైరుతి దిశలో ఉన్న తలుపు ద్వారా వెళ్లకూడదు. ఎందుకంటే ఇది దుష్ట శక్తులకు నిలయంగా ఉంటుంది. దీని గుండా వెళ్తే ఎల్లప్పుడూ కష్టాలు చుట్టుముడతాయి. దురదృష్టం వెంటాడుతుంది. ఇంటి బయటి దిశగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు హనుమాన్ బొమ్మలను ఉంచాలి. ఇలా చేస్తే వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఇలా ప‌లు వాస్తు సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల దోషాలు పోతాయి. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. అనుకున్న‌ది నెర‌వేరుతుంది.

Admin

Recent Posts