Buttermilk Vada : 10 నిమిషాల్లో ఎంతో రుచిక‌ర‌మైన మ‌జ్జిగ వ‌డ‌ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Buttermilk Vada : మ‌నం అప్పుడ‌ప్పుడూ వంటింట్లో గారెల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం.గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మ‌నం ర‌క‌ర‌కాల గారెల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన గారెలల్లో చ‌ల్ల గారెలు కూడా ఒక‌టి. పెరుగు వేసి చేసే ఈ గారెలు చాలా రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ చ‌ల్ల గారెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌ల్ల గారెలు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మంద‌పాటి అటుకులు – 2 క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, బియ్యం పిండి – 3 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టేబుల్ స్పూన్స్, పుల్ల‌టి పెరుగు – ఒక క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీస్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Buttermilk Vada recipe in telugu very tasty how to make them
Buttermilk Vada

చ‌ల్ల గారెల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో అటుకుల‌ను తీసుకోవాలి. త‌రువాత అందులో 3 క‌ప్పుల నీళ్లు పోసి 5 నిమిషాల పాటు అటుకుల‌ను నాన‌బెట్టాలి. త‌రువాత అటుకుల్లో ఉండే నీరంతా పోయేలా చేత్తో పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల్నీ వేసి క‌ల‌పాలి. అటుకులను చేత్తో న‌లుపుతూ గ‌ట్టిగా క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి.

నూనె వేడయ్యాక త‌గినంత అటుకుల మిశ్ర‌మాన్ని తీసుకుని వ‌డ‌ల ఆకారంలో వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ గారెల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై క‌ర‌క‌ర‌లాడుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చ‌ల్ల గారెలు త‌యార‌వుతాయి. వీటిని అలాగే నేరుగా తిన్నా లేదా ప‌ల్లి చ‌ట్నీతో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. త‌ర‌చూ చేసే వ‌డ‌ల‌కు బ‌దులుగా ఇలా అప్పుడ‌ప్పుడూ అటుకుల‌తో కూడా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ వ‌డ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts