Cabbage Coconut Fry : క్యాబేజీ కొబ్బరి ఫ్రై.. రుచిగా ఇలా చేయాలి.. అన్నం, ర‌సం, సాంబార్‌లోకి బాగుంటుంది..!

Cabbage Coconut Fry : మ‌నం ఆహారంలో భాగంగా క్యాబేజిని కూడా తీసుకుంటూ ఉంటాం. దీని వాస‌న‌, రుచి కార‌ణంగా మ‌న‌లో చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ క్యాబేజి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. క్యాబేజిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. క్యాబేజితో చేసుకోద‌గిన వంట‌కాల్లో క్యాబేజి ఫ్రై ఒక‌టి. ఈ ఫ్రై లో మ‌నం కొబ్బ‌రి వేసి మ‌రింత రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి వేసి చేసే క్యాబేజి ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, అంద‌రూ ఇష్ట‌ప‌డేలా కొబ్బ‌రి వేసి క్యాబేజీ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజి కొబ్బ‌రి ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ప‌చ్చిమిర్చి – 2, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, చిన్న‌గా త‌రిగిన క్యాబేజీ – పావు కిలో, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Cabbage Coconut Fry recipe in telugu very tasty
Cabbage Coconut Fry

క్యాబేజీ కొబ్బ‌రి ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు, అల్లం, వెల్లుల్లి , ప‌చ్చిమిర్చి వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత క్యాబేజి త‌రుగు, ఉప్పు, ప‌సుపు వేసి క‌లపాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ క్యాబేజిని పూర్తిగా వేయించాలి. క్యాబేజి చ‌క్క‌గా వేగిన త‌రువాత ఇందులో కారం, మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రి మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి కొబ్బ‌రి ఫ్రై త‌యారవుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే క్యాబేజి ఫ్రై కంటే ఈ విధంగా కొబ్బ‌రి వేసి చేసే క్యాబేజి ఫ్రై మ‌రింత రుచిగా ఉంటుంది. క్యాబేజిని ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ ఫ్రైను ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts