food

Cabbage Onion Pakoda : ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఇలా క్యాబేజీతో క‌లిపి వెరైటీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Cabbage Onion Pakoda : ప‌కోడీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడిగా ప‌కోడీల‌ను తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే ప‌కోడీల‌ను వెరైటీగా చేసుకునే వారు కూడా ఉంటారు. కానీ క్యాబేజీల‌ను క‌లిపి ప‌కోడీల‌ను ఎప్పుడైనా చేశారా.. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే క్యాబేజీ ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేయాలో ఇందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజీ ఉల్లిపాయ ప‌కోడీల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ పిండి – ఒక‌టింపావు క‌ప్పు, బియ్యం పిండి – పావు క‌ప్పు, వంట సోడా – చిటికెడు, ఉప్పు – త‌గినంత‌, కారం – అర టీస్పూన్‌, జీల‌క‌ర్ర పొడి – అర టీస్పూన్‌, ప‌సుపు – పావు టీస్పూన్‌, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన క్యాబేజీ – ఒక‌టింపావు క‌ప్పు, ఉల్లిపాయ – 1 పెద్ద‌ది (స‌న్న‌గా పొడుగ్గా కోయాలి), ప‌చ్చి మిర్చి – 2, కొత్తిమీర త‌రుగు – రెండు టేబుల్ స్పూన్లు, క‌రివేపాకు రెబ్బ‌లు – రెండు (స‌న్న‌గా కోయాలి), నూనె – వేయించేందుకు స‌రిప‌డా.

cabbage onion pakoda make like this

క్యాబేజీ ఉల్లిపాయ ప‌కోడీల‌ను త‌యారు చేసే విధానం..

ఒక గిన్నెలో క్యాబేజీ త‌రుగు, ఉల్లిపాయ త‌రుగు, నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌ను వేసుకుని బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఇందులో క్యాబేజీ త‌రుగు, ఉల్లిపాయ త‌రుగు వేసి క‌ల‌పాలి. అవ‌స‌రం అనుకుంటే చాలా కొద్దిగా నీళ్లు చ‌ల్లుకుని మ‌రోసారి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని కాగుతున్న నూనెలో ప‌కోడీల్లా వేసుకుని ఎర్ర‌గా వేయించుకుని తీసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ ఉల్లిపాయ ప‌కోడీలు రెడీ అవుతాయి. వీటిని సాయంత్రం స‌మ‌యంలో ఎంతో వేడిగా ఆస్వాదించ‌వ‌చ్చు. టేస్ట్ అదిరిపోతుంది.

Admin

Recent Posts