Samantha : నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.. స‌మంత పోస్టు వైర‌ల్‌..!

Samantha : ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌మంత‌కు బాగానే పేరు వ‌చ్చింది. అయితే ఉత్త‌రాదిలో ఆమెకు నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంత పెద్ద గుర్తింపు ఏమీ లేదు. కానీ పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐట‌మ్ సాంగ్ వ‌ల్ల ఆమెకు ఎంతో పేరు వ‌చ్చింది. దీంతో నార్త్ సైడ్‌లోనూ ఆమె పేరు మారుమోగిపోతోంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ స‌మంత గ‌తంలో ఎన్న‌డూ లేనంత విధంగా యాక్టివ్‌గా ఉంటోంది. త‌ర‌చూ ఆమె ఈ మ‌ధ్య వెకేష‌న్స్‌కు వెళ్తోంది. అందులో భాగంగానే ప్ర‌స్తుతం ఆమె కేర‌ళ‌లో ఎంజాయ్ చేస్తోంది.

can not image without you Samantha  post viral
Samantha

కేర‌ళ‌లో వాట‌ర్ ఫాల్స్ వ‌ద్ద దిగిన ఫొటోల‌ను స‌మంత తాజాగా షేర్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఆ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. కాగా స‌మంత మ‌ళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్టు పెట్టింది. తన స్నేహితురాలు మేఘ‌నా వినోద్‌తో క‌లిసి బీచ్ ఒడ్డున కూర్చుని న‌వ్వుతూ ఫొటో దిగింది. దాన్ని షేర్ చేసింది. అలాగే దాని కింద కాప్ష‌న్ పెట్టింది. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.. అని కాప్ష‌న్ పెట్ట‌డంతోపాటు బెస్ట్‌ ఫ్రెండ్స్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది. ఈ క్ర‌మంలోనే స‌మంత పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

ఇక గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన శాకుంత‌లం సినిమాతోపాటు య‌శోద అనే మ‌రో పాన్ ఇండియా మూవీలోనూ స‌మంత న‌టించింది. దీంతోపాటు కాతు వాకుల రెండు కాద‌ల్ అనే త‌మిళ మూవీలోనూ ఈమె కీల‌క‌పాత్ర‌ను పోషించింది. ఈ మూవీ ఏప్రిల్‌లో విడుద‌ల కానుంది.

Admin

Recent Posts