Liver : లివర్‌ చెడిపోతే ఆరంభంలో కనిపించే లక్షణాలు ఇవే..!

Liver : మన శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాల్లో లివర్‌ అతి పెద్ద అవయవం. ఇది అనేక పనులను నిర్వర్తిస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి శరీరానికి అందిస్తుంది. అలాగే శరీరానికి శక్తిని అందిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతోపాటు అనేక ఇతర జీవక్రియలను కూడా లివర్‌ నిర్వర్తిస్తుంది. అయితే లివర్‌ చెడిపోతే ఆరంభంలోనే మనకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Liver failure symptoms that appear at early stage
Liver

1. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో లివర్‌ ఎంతగానో దోహదపడుతుంది. అయితే లివర్‌ చెడిపోతే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో అజీర్ణ సమస్య వస్తుంది. ఆకలి అస్సలు ఉండదు. అలాగే నోటి దుర్వాసన విపరీతంగా వస్తుంటుంది.

2. లివర్‌ చెడిపోయిన వారు ఎక్కువగా కంగారు, ఆందోళన పడుతుంటారు. ఏ విషయంలో అయినా చిరాకుగా అనిపిస్తుంటుంది. ఏ పని చేయబుద్ది కాదు.

3. లివర్‌ సమస్యలు ఉన్నవారికి రక్తస్రావం సులభంగా అవుతుంటుంది. చిన్నపాటి గాయం అయినా రక్తం ఎక్కువగా పోతుంది.

4. లివర్‌ చెడిపోతే కొందరికి శరీరం పసుపు రంగులోకి మారుతుంది. చర్మం, కళ్లు పసుపు రంగులో కనిపిస్తాయి.

5. లివర్‌ చెడిపోయిన వారి కాళ్లు వాపులకు గురవుతాయి. వాపులపై ఒత్తిడి కలిగిస్తే చిన్న గుంతలా ఏర్పడి అలాగే ఉంటుంది.

6. లివర్‌ సమస్య ఉన్నవారి పొట్ట కూడా ఉబ్బిపోయి కనిపిస్తుంది. కడుపు ఉబ్బరం వచ్చినట్లు అనిపిస్తుంటుంది. గ్యాస్‌ బాగా వస్తుంది.

7. లివర్‌ చెడిపోతే కొందరికి కడుపులో నొప్పి వస్తుంది. ముఖ్యంగా కుడివైపు ఊపిరితిత్తుల కింది భాగంలో బాగా నొప్పిగా ఉంటుంది. అలాగే వికారంగా అనిపిస్తుంటుంది. కొందరికి వాంతులు కూడా అవుతాయి.

8. చర్మంపై దురదలు, వాపులు బాగా వస్తున్నాయంటే.. లివర్‌ సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.

ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే స్పందించాలి. డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే మందులను కూడా వాడాలి. దీంతో లివర్‌ పూర్తిగా చెడిపోకుండా ఆరంభంలోనే గుర్తించి కాపాడుకోవచ్చు. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.

Admin

Recent Posts