Carrots And Rice Flour Snacks : క్యారెట్లు, బియ్యం పిండి క‌లిపి ఇలా స్నాక్స్ చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Carrots And Rice Flour Snacks : క్యారెట్ స్నాక్స్.. క్యారెట్, బియ్యంపిండితో చేసే ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు వీటిని ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా ఉండే ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. క్యారెట్ తిన‌ని పిల్ల‌ల‌కు ఇలా వాటితో రుచిక‌ర‌మైన స్నాక్స్ ను చేసి ఇవ్వ‌డం వ‌ల్ల క్యారెట్ లో ఉండే పోష‌కాలు పిల్ల‌లకు చ‌క్క‌గా అందుతాయి. ఈ స్నాక్స్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. సాయంత్రం స‌మ‌యంలో వేడి వేడిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా క్యారెట్స్ తో స్నాక్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. క్యారెట్స్ తో రుచిగా స్నాక్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ స్నాక్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యారెట్స్ – 3, స‌న్న‌గా పొడ‌వుగా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, బియ్యంపిండి – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Carrots And Rice Flour Snacks everybody likes them
Carrots And Rice Flour Snacks

క్యారెట్ స్నాక్స్ త‌యారీ విధానం..

ముందుగా క్యారెట్స్ పై ఉండే చెక్కును తీసివేయాలి. త‌రువాత వీటిని స‌న్న‌గా తురుముకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో బియ్యంపిండి త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ క‌లుపుకోవాలి. ఇందులో అస్స‌లు నీళ్లు పోయ‌కుండా చేత్తో బాగా వ‌త్తుతూ క‌లుపుకోవాలి. అవ‌స‌ర‌మైతే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లు పోసి క‌లుపుకోవాలి. త‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వ‌డ‌లాగా వ‌త్తుకోవాలి. లేదంటే మ‌న‌కు న‌చ్చిన ఆకారంలో వ‌త్తుకోవాలి. ఇలా అన్నింటిని వ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యారెట్ స్నాక్స్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ క‌దుపుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ స్నాక్స్ త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా క్యారెట్ తో రుచిక‌ర‌మైన స్నాక్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts