Induction Stove Cleaning Tips : మీ ఇంట్లో ఉన్న ఇండ‌క్ష‌న్ స్ట‌వ్‌ను ఇలా ఈజీగా క్లీన్ చేయండి.. ఈ 7 చిట్కాల‌ను పాటించండి..!

Induction Stove Cleaning Tips : ప్రస్తుత కాలంలో మ‌నం వంట‌చేయ‌డానికి వివిధ ర‌కాల ప‌రికరాల‌ను ఉప‌యోగిస్తూ ఉన్నాము. ఒక్కప్పుడు గ్యాస్ స్ట‌వ్ ను మాత్ర‌మే ఉప‌యోగించే వాళ్లం. కానీ ఇప్పుడు మ‌నం ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ ను కూడా ఉప‌యోగిస్తున్నాము. ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ మీద కూడా దాదాపు మ‌నం అన్ని ర‌కాల వంట‌కాల‌ను వండుతూ ఉంటాము. అలాగే దీనిని ఎక్క‌డికైనా చాలా సుల‌భంగా తీసుకెళ్ల‌వ‌చ్చు. అయితే దీనిపై కూడా ఒక్కోసారి మనం చేసే వంట‌లు చిందుతూ ఉంటాయి. పాలు, టీ వంటివి పొంగుతూ ఉంటాయి. క‌నుక దీనిని కూడా త‌రుచూ శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ లో ఉండే ఫ్యాన్ పనిచేయ‌డం ఆగిపోతుంది. అయితే దీనిని గ్యాస్ స్ట‌వ్ వ‌లె శుభ్రం చేయ‌లేము. అలా అని దీనిని శుభ్రం చేయ‌కుండా ఉండ‌లేము.

అయితే కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ ను కూడా చాలా సుల‌భంగా శుభ్రం చేసుకోవ‌చ్చు. ముందుగా ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ ను పొడి గుడ్డ‌తో తుడ‌వాలి. త‌రువాత ఒక గిన్నెలో వైట్ వెనిగ‌ర్ ను అలాగే దీనికి స‌మానంగా నీటిని క‌లిపి తీసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మంలో వ‌స్త్రాన్ని ముంచి ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ ను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స్ట‌వ్ శుభ్ర‌ప‌డుతుంది. అలాగే ఒక గిన్నెలో బేకింగ్ సోడాను తీసుకోవాలి. త‌రువాత ఇందులో గోరువెచ్చని నీటిని పోసి క‌ల‌పాలి. త‌రువాత వ‌స్త్రాన్ని ఈ మిశ్ర‌మంలో ముంచి దానితో స్ట‌వ్ ను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ శుభ్ర‌ప‌డుతుంది. అలాగే నీటిలో డిష్ వాషింగ్ లిక్విడ్ ను వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మంలో వ‌స్త్రాన్ని ముంచి దానితో స్ట‌వ్ ను తుడ‌వాలి.

Induction Stove Cleaning Tips in telugu
Induction Stove Cleaning Tips

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వల్ల ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ ను చాలా సుల‌భంగా శుభ్రం చేసుకోవ‌చ్చు. అయితే ఈ ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ ను శుభ్రం చేసే ముందు దానిని అన్ ప్ల‌గ్ చేయాలి. ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ కు క‌రెంటు స‌ర‌ఫ‌రా లేకుండా చూసుకోవాలి. త‌రువాత స్ట‌వ్ ను శుభ్రం చేసే ముందు దానిని పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ఉంచాలి. స్ట‌వ్ పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత మాత్ర‌మే శుభ్రం చేసుకోవాలి. అలాగే దీనిని త‌క్కువ నీటితో శుభ్రం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి. ఎక్కువ నీటితో శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల క‌రెంట్ ప‌రిక‌రాల‌కు హాని క‌లుగుతుంది. ఈ విధంగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఈ చిట్కాల‌ను పాటించ‌డం వల్ల ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ ను చాలా సుల‌భంగా శుభ్రం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts