Chakkera Pongali Recipe : గుడిలో అందించే ప్రసాదంలా చ‌క్కెర పొంగ‌లి రుచిగా రావాలంటే.. ఇలా చేయండి..!

Chakkera Pongali Recipe : మ‌నం దేవుడికి నైవేధ్యంగా స‌మ‌ర్పించే వాటిలో చ‌క్కెర పొంగ‌లి కూడా ఒక‌టి. దీనిని గుళ్ల‌ల్లో కూడా మ‌న‌కు ప్ర‌సాదంగా ఇస్తూ ఉంటారు. కేవ‌లం నైవేధ్యంగానే కాకుండా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు కూడా చాలా మంది దీనిని త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. చ‌క్కెర పొంగ‌లి చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. చ‌క్కెర పొంగ‌లిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. దీనిని ఎవ‌రికి న‌చ్చిన విధంగా వారు త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే చ‌క్కెర పొంగ‌లి కూడా చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ చ‌క్కెర పొంగ‌లిని అంద‌రికి న‌చ్చేలా సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌క్కెర పొంగ‌లి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెస‌ర‌ప‌ప్పు – పావు క‌ప్పు, బియ్యం – ముప్పావు క‌ప్పు, నీళ్లు – 2 క‌ప్పులు, నెయ్యి – ఒక టీ స్పూన్, బెల్లం తురుము – అర క‌ప్పు, పంచ‌దార – ముప్పావు క‌ప్పు, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, ప‌చ్చ కర్పూరం – చిటికెడు.

Chakkera Pongali Recipe make it like served in temples
Chakkera Pongali Recipe

చ‌క్కెర పొంగ‌లి త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో పెస‌ర‌ప‌ప్పు వేసి వేయించాలి. వీటిని కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించిన త‌రువాత బియ్యం వేసి వేయించాలి. బియ్యాన్ని కూడా చ‌క్క‌గా వేయించిన త‌రువాత నీళ్లు పోసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత 2 క‌ప్పుల నీళ్లు, ఒక టీస్పూన్ నెయ్యి వేసి కుక్క‌ర్ మూత పెట్టాలి. ఈ బియ్యాన్ని మ‌ద్య‌స్థ మంట‌పై 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి అంతా క‌లిసేలా క‌లుపుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో బెల్లం, పంచ‌దార వేసి ముప్పావు క‌ప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం క‌రిగిన త‌రువాత ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ బెల్లం నీటిని వ‌డ‌క‌ట్టి ముందుగా ఉడికించిన అన్నంలో వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని స్ట‌వ్ మీద ఉంచి నీరంగా పోయే వ‌ర‌కు మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించాలి.

ఇలా పొంగ‌లి ఉడుకుతుండ‌గానే మ‌నో స్ట‌వ్ మీద క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత కొబ్బ‌రి ముక్క‌లు, జీడిప‌ప్పు, ఎండుద్రాక్ష వేసివేయించి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు పొంగ‌లి చ‌క్క‌గా ఉడికి ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత ఇందులో యాల‌కుల పొడి, ప‌చ్చ క‌ర్పూరం, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చ‌క్కెర పొంగ‌లి త‌యార‌వుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఉండే చ‌క్కెర పొంగ‌లిని త‌యారు చేసుకుని తినవ‌చ్చు. దీనిని ఒక స్పూన్ కూడా విడిచిపెట్టకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts