Chana Chaat : సాయంత్రం స‌మ‌యంలో ఇలా శ‌న‌గ‌ల‌తో చాట్ చేసుకుని తినండి.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Chana Chaat : మ‌నం న‌ల్ల శ‌న‌గ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఈ శ‌న‌గ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్ ను అందించ‌డంలో, పోష‌కాహార లోపాన్ని త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా శ‌న‌గ‌లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. వీటితో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో చ‌నా చాట్ కూడా ఒక‌టి. త‌రుచూ గుగ్గిళ్లే కాకుండా శ‌న‌గ‌ల‌తో ఇలాఎంతో రుచిక‌ర‌మైన చాట్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. స్నాక్స్ గా, సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ శ‌న‌గ‌ల చాట్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌నా చాట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

న‌ల్ల శ‌న‌గ‌లు – ఒక కప్పు, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్ ( కాడ‌ల‌తో స‌హా), ప‌చ్చిమిర్చి – 2, పుదీనా – ఒక టేబుల్ స్పూన్, అల్లం – అర అంగుళం, బెల్లం – ఒక టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ట‌మాటా – 1, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, నిమ్మ‌కాయ – 1.

Chana Chaat recipe in telugu very tasty snack
Chana Chaat

చ‌నా చాట్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో శ‌న‌గ‌లను తీసుకుని శుభ్రంగా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి 2 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని కుక్క‌ర్ లో వేసి నీళ్లు పోయాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి మూత పెట్టి 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ శ‌న‌గ‌ల‌ను వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు జార్ లో కొత్తిమీర‌, పుదీనా, అల్లం, బెల్లం, బ్లాక్ సాల్ట్, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత శ‌న‌గ‌లు వేసి క‌ల‌పాలి.

వీటిని త‌డి పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, చాట్ మ‌సాలా, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రో రెండు నుండి మూడు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు, త‌రిగిన కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చ‌నా చాట్ త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. శ‌న‌గ‌ల‌తో చేసిన ఈ చాట్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు.

D

Recent Posts