Anjeer Water Benefits : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ కూడా ఒకటి. వీటిని వివిధ రకాల తీపి వంటకాల్లో వాడడంతో పాటు నేరుగా కూడా తింటూ ఉంటారు. అంజీర్ చాలా రుచిగా, చాలా తియ్యగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అలాగే ఈ అంజీర్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంజీర్ లో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఇవి ఎంతో దోహదపడతాయి. వైద్యులు కూడా అంజీర్ ను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అంజీర్ లను చాలా మంది నేరుగా తింటూఉంటారు. ఇలా నేరుగా తినడానికి బదులుగా అంజీర్ లో నీటిలో నానబెట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అంజీర్ నీరు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారు చెబుతున్నారు. అంజీర్ నీటిని తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో 2 లేదా 3 అంజీర్ లను తీసుకుని అవి మునిగే వరకు నీటిని పోయాలి. తరువాత వీటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ అంజీర్ లను తిని పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా అంజీర్ నీటిని తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంజీర్ నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. అంజీర్ లను తిని అంజీర్ నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ప్రేగులల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అంజీర్ నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రక్తపోటు సమస్య తగ్గుతుంది. శరీరంలో అధికంగా ఉండే సోడియం తొలగిపోతుంది. అంతేకాకుండా అంజీర్ తో పాటు నీటిని తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా, బలంగా తయారవుతాయి. ఎముకల సాంద్రత పెరిగి ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. రక్తహీనత సమస్య తగ్గడంతో పాటు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా అంజీర్ నీటిని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా అంజీర్ లను, అంజీర్ నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ప్రతిఒక్కరు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.