Charmy Kaur : మద్యం సేవిస్తున్న చార్మి.. ఫొటో తీసి పోస్ట్ చేసిన వ‌ర్మ‌.. నెట్టింట్లో దుమారం..!

Charmy Kaur : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ సాధార‌ణ పోస్టులు పెడితే ఆశ్చ‌ర్య‌పోవాలి కానీ.. వివాదాస్ప‌ద పోస్టులు పెడితే పెద్దగా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. నిత్యం ఈయ‌న ఏదో ఒక విష‌యంపై పోస్టులు పెడుతూ వివాదాల‌కు కేరాఫ్‌గా నిలుస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇటీవ‌లి కాలంలో హీరోయిన్స్ వెంట ప‌డుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు హీరోయిన్స్ మాత్ర‌మే కాకుండా యాంక‌ర్ల ఫొటోల‌ను కూడా తీస్తూ వాటిని త‌న సోష‌ల్ ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. అయితే ఇలా ఈయ‌న ఫొటోల‌ను షేర్ చేయ‌డం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిట‌న్న‌ది తెలియ‌దు కానీ.. ఆయ‌న షేర్ చేసే ఫొటోలు మాత్రం దుమారం రేపుతుంటాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈయ‌న షేర్ చేసిన చార్మి ఫొటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Charmy Kaur with peg glass RGV shared photo
Charmy Kaur

న‌టి చార్మి ప్ర‌స్తుతం నిర్మాత‌గా మారి ప‌లు సినిమాల‌ను నిర్మించిన విష‌యం విదిత‌మే. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి ఈమె సినిమాల‌కు నిర్మాత‌గా ఉంటోంది. అయితే తాజాగా చార్మి ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌తో క‌లిసి పెగ్గేసింది. ఆ క్ర‌మంలో వ‌ర్మ చార్మిని ఫొటో తీశారు. చేతిలో మందు గ్లాసుతో ఉన్న చార్మి ఫొటోను ఆయ‌న క్లిక్‌మ‌నిపించారు. అనంత‌రం దాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటో దుమారం రేపుతోంది. సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది.

చార్మి మంచి న‌టి. కానీ ఆమెను ఈ విధంగా ఎవ‌రూ చూడ‌లేదు. అయితే మ‌ద్యం సేవిస్తూ చార్మి అంద విహీనంగా అదో ర‌కంగా క‌నిపిస్తుండే స‌రికి నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. చార్మి ఫొటోను ఇలా చూసిన వారు ఆమెను దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. అలాగే వ‌ర్మ‌పై కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇలాంటి ఫొటోల‌ను ఎందుకు షేర్ చేశారు ? అంటూ వ‌ర్మ‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

Editor

Recent Posts