Shamili : బేబీ షామిలీ. ఈ పేరు చెప్పగానే మనకు ఆమె చిన్నప్పుడు నటించిన.. అంజలి అంజలి.. మెరిసే నవ్వుల పువ్వుల జాబిలి.. అనే పాట గుర్తుకు వస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా షామిలీ ఎంతో పేరు తెచ్చుకుంది. బాల నటిగా అనేక సినిమాల్లో ఈమె నటించి అలరించింది. తరువాత ఓయ్ అనే సినిమాలో నటుడు సిద్ధార్థ్‌తో కలిసి సందడి చేసింది. అయితే ఆ మూవీ పెద్దగా హిట్ కాలేదు. దీంతో ఈమె సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తరువాత ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టింది.
ఓయ్ సినిమాలో కాస్త లావుగా కనిపించే సరికి షామిలీ అనేక విమర్శలను ఎదుర్కొంది. దీంతో ఆ సినిమా అనంతరం ఆమె మరే సినిమాలోనూ నటించలేదు. అసలు ఆమెకు ఆఫర్లు కూడా రాలేదు. తరువాత ఆరోగ్యంపై దృష్టి పెట్టి సన్నగా మారింది. ఆ తరువాత కొంత కాలానికి నాగశౌర్యతో కలిసి అమ్మమ్మగారి ఇల్లు అనే సినిమాలో కనిపించింది. కానీ ఈ సినిమా కూడా విజయం సాధించలేదు. దీంతో షామిలీ సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేసింది. చదువుపై ఫోకస్ పెట్టి కంప్లీట్ చేసింది.
ఇక తాజాగా షామిలీ తన సోదరి, నటి షాలిని ఇంటి ఫంక్షన్‌లో కనిపించి అలరించింది. షాలిని నటుడు అజిత్‌ను వివాహం చేసుకున్న విషయం విదితమే. వీరికి అనోష్క అనే కుమార్తె ఉంది. ఈ క్రమంలోనే తన సోదరి షాలిని, ఆమె కుమార్తె అనోష్కతో కలిసి షామిలీ తాజాగా ఫొటోలు దిగి వాటిని షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. వాటిల్లో ఆమె అసలు గుర్తు పట్టలేకుండా నాజూగ్గా మారి ఉండడాన్ని గమనించవచ్చు. ఈ క్రమంలోనే అప్పటి షామిలి.. ఇప్పటి షామిలి ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు.