Chat Masala Powder : వంట‌ల్లో ఉప‌యోగించే చాట్ మసాలా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..

Chat Masala Powder : మ‌నం వంటింట్లో బ‌య‌ట ఎక్కువ‌గా దొరికే చిరుతిళ్ల‌ను కూడా అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూ ఉంటాం. బ‌య‌ట చేసే చిరుతిళ్లల్లో ఎక్కువ‌గా చాట్ మ‌సాలాను ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ చాట్ మ‌సాలాను వాడ‌డం వ‌ల్ల ఆహార పదార్థాల రుచి మ‌రింత పెరుగుతుంది. ఈ చాట్ మ‌సాలా మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతుంది. బ‌య‌ట ల‌భించే విధంగా అదే రుచితో అదే వాస‌న‌తో ఉండేలా ఈ చాట్ మ‌సాలాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో చాట్ మ‌సాలాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చాట్ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – 2 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, మిరియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్, పుదీనా ఆకులు – పావు క‌ప్పు, శొంఠి – 2 ఇంచుల ముక్క‌, రాళ్ల ఉప్పు – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, న‌ల్ల ఉప్పు – 3 టీ స్పూన్స్, ఆమ్ చూర్ పొడి – 3 టేబుల్ స్పూన్స్, పంచ‌దార – ఒక టీ స్పూన్, వంట‌సోడా – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్.

Chat Masala Powder make in this way very easy method
Chat Masala Powder

చాట్ మ‌సాలా తయారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ధ‌నియాలు, మిరియాలు, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు వేసి చిన్న మంట‌పై మాడిపోకుండా వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత జీల‌క‌ర్రను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దినుసుల‌ను జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో పుదీనా ఆకుల‌ను కూడా వేసి క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత వీటిని కూడా అదే జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు వాటిలోనే శొంఠిని ముక్క‌లుగా చేసి వేసుకోవాలి.

త‌రువాత ఒక్కొక్క‌టిగా మిగిలిన ప‌దార్థాన్నింటిని కూడా వేయాలి. త‌రువాత ఈ ప‌దార్థాల‌న్నింటినీ కూడా వీలైనంత మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో ఉంచి గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల చాలా కాలం వ‌ర‌కు తాజాగా ఉంటుంది. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల బ‌య‌ట షాపుల్లో ల‌భించే విధంగా ఉండే చాట్ మ‌సాలా త‌యార‌వుతుంది. ఇలా త‌యారు చేసుకున్న చాట్ మ‌సాలాను మనం ఇంట్లో త‌యారు చేసే ప‌దార్థాల్లో వాడ‌డం వ‌ల్ల ప‌దార్థాల రుచి మ‌రింత పెరుగుతుంది.

D

Recent Posts