Chicken Fry : చికెన్ ఫ్రైని ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే జన్మ‌లో మ‌రిచిపోరు..!

Chicken Fry : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. నేరుగా తిన‌డానికి, సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఈ చికెన్ ఫ్రైను వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే చికెన్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రింత రుచిగా, క్రిస్పీగా చికెన్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, చికెన్ – అర‌కిలో, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్ లేదా త‌గినంత‌, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chicken Fry recipe make like this once for taste
Chicken Fry

చికెన్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చికెన్ వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని నీరంతా పోయి నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ మెత్త‌గా, ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు బాగా వేయించాలి. చికెన్ పూర్తిగా వేగిన త‌రువాత కొత్తిమీర త‌ప్ప మిగిలిన మ‌సాలా పొడులు వేసి బాగా క‌ల‌పాలి. దీనిని మ‌రో 2 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై త‌యారవుతుంది. ప‌ప్పు, సాంబార్, ర‌సం వంటి వాటితో తింటే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts