Chicken Menthikura Iguru : చికెన్ మెంతికూర ఇగురు ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌హ్వా అంటారు..!

Chicken Menthikura Iguru : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చికెన్ తో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు కింద చెప్పిన విధంగా చికెన్ మెంతికూర ఇగురును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మెంతికూర‌, చికెన్ క‌లిపి చేసే ఈ ఇగురు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మెంతికూర‌ను తిన‌ని వారు కూడా ఈ ఇగురును ఇష్టంగా తింటారు. వెరైటీ రుచుల‌ను కోరుకునే వారు ఈ చికెన్ మెంతికూర ఇగురును త‌ప్ప‌కుండా ట్రై చేయాల్సిందే. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ చికెన్ మెంతికూర ఇగురును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ మెంతికూర ఇగురు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో, మెంతికూర – 4 క‌ట్ట‌లు ( చిన్న‌వి), నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, స‌న్న‌గా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ‌లు – 4 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 3 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక క‌ప్పు, గ‌రం మ‌సాలా -ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chicken Menthikura Iguru recipe in telugu everybody likes this
Chicken Menthikura Iguru

చికెన్ మెంతికూర ఇగురు త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ప‌సుపు వేసి క‌లిపి అర‌గంట పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మెంతికూర వేసి వేయించాలి. దీనిని పూర్తిగా వేయించిన త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌ధ్ మ‌ధ్య‌లో క‌లుపుతూ 10 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి.

త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి చిన్న‌గా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి.ఇలా ఉడికించిన త‌రువాత గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ మెంతికూర ఇగురు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ చికెన్ తో ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన చికెన్ మెంతికూర ఇగురును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts