Chicken Roast : హోట‌ల్‌లో ల‌భించే విధంగా చికెన్ రోస్ట్‌ను ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Chicken Roast : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చికెన్ వేపుడు కూడా ఒక‌టి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అయితే మ‌నం ఈ చికెన్ వేపుడును ర‌క‌ర‌కాల ప‌ద్ద‌తుల్లో త‌యారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా చికెన్ తో కింద చెప్పిన విధంగా చేసే చికెన్ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌రింత రుచిగా, అంద‌రికి ఎంతో న‌చ్చేలా ఈ చికెన్ వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ రోస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ చికెన్ – కిలో, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3, త‌రిగిన ట‌మాటాలు – 3, త‌రిగిన కొత్తిమీర – ఒక క‌ట్ట‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ల‌వంగాలు – 6, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క‌, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – 5 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి -ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్.

Chicken Roast recipe in telugu make like this
Chicken Roast

మ‌సాలా దినుసులు..

బిర్యానీ ఆకు – 1,అనాస పువ్వు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, సాజీరా – అర టీ స్పూన్.

చికెన్ రోస్ట్ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో కొత్తిమీర‌, ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, ల‌వంగాలు, దాల్చిన చెక్క వేసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని శుభ్రం చేసుకున్న చికెన్ లో వేసి క‌ల‌పాలి. ఇందులోనే ఉప్పు, ప‌సుపు వేసి క‌లిపి ప‌క్కకు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత చికెన్ వేసి పెద్ద మంట‌పై 15 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రో 15 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ వేయించాలి.

ఇలా వేయించాక కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, మిరియాల పొడి, క‌సూరి మెంతి, గ‌రం మసాలా వేసి క‌ల‌పాలి. ఈ చికెన్ ను ,ఇన్న మంట‌పై మ‌రో 5 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ రోస్ట్ త‌యార‌వుతుంది. దీనిని ఉల్లిపాయ, నిమ్మ‌ర‌సంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తిన‌వ‌చ్చు. ఈ చికెన్ రోస్ట్ ను మ‌నం మామూలు చికెన్ తో కూడా ఇదే విధంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చికెన్ రోస్ట్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts