Chicken Strips : ఎంతో రుచిక‌ర‌మైన చికెన్ స్ట్రైప్స్‌.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూర‌తాయి..

Chicken Strips : నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో చికెన్ కూడా ఒక‌టి. చికెన్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. చికెన్‌తో వేపుడు, కూర‌, పులావ్‌, బిర్యానీ.. ఇలా ఏది చేసినా స‌రే.. ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే చికెన్‌తో మ‌నం స్నాక్స్‌ను కూడా చేసుకోవ‌చ్చు. వాటిల్లో చికెన్ స్ట్రైప్స్ కూడా ఒక‌టి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. రెస్టారెంట్ల‌లోనే ల‌భిస్తాయి. కానీ కాస్త క‌ష్ట‌ప‌డితే మ‌నం వీటిని ఎంతో ఈజీగా ఇంట్లోనే చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే చికెన్ స్ట్రైప్స్ ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ స్ట్రైప్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ చికెన్ ముక్క‌లు (కాస్త పెద్ద‌గా ఉండాలి) – 3, కోడిగుడ్లు – 2, నిమ్మ‌ర‌సం – 1 టేబుల్ స్పూన్‌, ఉప్పు – 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి – ఒక‌ టీస్పూన్‌, మిర‌ప‌కాయ – 1 టేబుల్ స్పూన్‌, ఆల్ ప‌ర్పోస్ ఫ్లోర్ – 1 క‌ప్పు, బేకింగ్ పౌడ‌ర్ – 1 క‌ప్పు, వెల్లుల్లి పొడి – అర టీస్పూన్‌, నూనె – వేయించ‌డానికి స‌రిప‌డా.

Chicken Strips recipe in telugu very tasy easy to make them
Chicken Strips

చికెన్ స్ట్రైప్స్‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా చికెన్ ని స్ట్రైప్స్‌ లాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక పాత్రలో గుడ్లు పగలగొట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలపాలి. ఇప్పుడు మరో పాత్రలో ఆల్ ప‌ర్పోస్ ఫ్లోర్‌ తీసుకుని దానికి బేకింగ్ పౌడర్ కలపాలి. అనంత‌రం కారం, ఉప్పు, వెల్లుల్లి పొడి, మిరియాల పొడిని కలపాలి. చికెన్ ముక్కల మీద ఈ మిక్స్ ని బాగా కవర్ చేయాలి. ఆ తరువాత గుడ్డు మిశ్ర‌మాన్ని చికెన్ ముక్కలపై కోటింగ్ లా ప‌ట్టించాలి. ఇదే పద్దతిని రెండు సార్లు చేయాలి. ఆ తరువాత స్ట‌వ్ ఆన్ చేసి పాత్ర పెట్టి అందులో నూనె పోయాలి. నూనె కాగాక అందులో చికెన్ ముక్క‌ల‌ను వేసి చిన్నమంట పెట్టాలి. అనంతరం చికెన్ ముక్క‌ల‌ను బంగారు రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. అంతే.. ఎంతో రుచిక‌ర‌మైన చికెన్ స్ట్రైప్స్ రెడీ అవుతాయి. వీటిని సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ లా తిన‌వ‌చ్చు. లేదా భోజ‌నం చేసే స‌మ‌యంలో స్టార్ట‌ర్స్ లా కూడా తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటాయి.

Editor

Recent Posts