Chicken Wings Fry : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ వింగ్స్ ఫ్రై.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా చేయ‌వ‌చ్చు..!

Chicken Wings Fry : మ‌నం చికెన్ వింగ్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిని ఎంతో ఇష్టంగా తినే వారు కూడా ఉంటారు. ఈ చికెన్ వింగ్స్ తో మ‌నం కూర‌నే కాకుండా ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ వింగ్స్ ఫ్రై క్రిస్పీగా, తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా, స్నాక్స్ గా తిన‌డానికి ఈ ఫ్రై చాలా చక్క‌గా ఉంటుంది. అలాగే ఈ ఫ్రైను ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ చికెన్ వింగ్స్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ వింగ్స్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ వింగ్స్ – అర‌కిలో, ఉప్పు -త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, కోడిగుడ్డు – 1, బియ్యం పిండి – అర టేబుల్ స్పూన్, కార్న్ ప్లోర్ – ఒక టేబుల్ స్పూన్, క‌సూరిమెంతి – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Chicken Wings Fry recipe in telugu make it in restaurant style
Chicken Wings Fry

చికెన్ వింగ్స్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో చికెన్ వింగ్స్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌సుపు, నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత వీటిని అర‌గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత ఈ చికెన్ వింగ్స్ ను బ‌య‌ట‌కు తీసి అందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చికెన్ వింగ్స్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ వింగ్స్ త‌యార‌వుతాయి. వీటిని నిమ్మ‌ర‌సం, ఉల్లిపాయ‌ల‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ వింగ్స్ తో ఫ్రైను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts