Vegetables Juice For Cholesterol : ఈ జ్యూస్ తాగితే చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అవుతుంది..!

Vegetables Juice For Cholesterol : చెడు కొలెస్ట్రాల్.. మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. నేటి త‌రుణంలో యుక్త‌వ‌య‌సులో ఉన్న వారు చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌వ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డి గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య కార‌ణంగా చాలా మంది ప్రాణాల‌ను కూడా కోల్పోతున్నారు. సాధార‌ణంగా మ‌న శ‌రీరానికి రోజుకు 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ అవ‌స‌రమ‌వుతుంది. హార్మోన్ల ఉత్ప‌త్తి అవ్వ‌డానికి, శ‌రీరం విట‌మిన్ డి ని త‌యారు చేసుకోవ‌డానికి, పైత్య ర‌సం త‌యార‌వ్వ‌డానికి కొలెస్ట్రాల్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఈ కొలెస్ట్రాల్ ను మ‌నం కాలేయం త‌యారు చేసి విడుద‌ల చేస్తూ ఉంటుంది. మ‌న అవ‌స‌రాల‌కు మ‌న శ‌రీరం త‌యారు చేసే కొలెస్ట్రాల్ స‌రిపోతుంది.

కానీ మ‌నం జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, కార్బోహైడ్రేట్స్ క‌లిగిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, పంచ‌దార క‌లిగిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, కూర‌గాయ‌లు, పండ్లు, స‌లాడ్ వంటి వాటిని తీసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా పేరుకుపోతుంది. అలాగే వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, శ‌రీరం క‌ద‌ల‌కుండా ప‌నులు చేసుకోవ‌డం వ‌ల్ల అద‌నంగా శ‌రీరంలోకి చేరిన కొలెస్ట్రాల్ పేరుకుపోయి అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. ర‌క్త‌నాళాల్లో పొర‌లు దెబ్బ‌తిన్న చోట ఈ చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి క్ర‌మంగా ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డి ప్రాణాల‌కు ముప్పు వాటిల్లుతుంది. క‌నుక మ‌నం మ‌న శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూసుకోవాలి. శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొల‌గించుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డాలంటే మ‌న జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకోవాలి.

Vegetables Juice For Cholesterol take daily for better effect
Vegetables Juice For Cholesterol

ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను, కార్బోహైడ్రేట్స్ త‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. రోజూ ఉద‌యం కూర‌గాయ‌ల‌ను జ్యూస్ గా చేసి తీసుకోవాలి. వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఫైబ‌ర్ ర‌క్తనాళాల్లో ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొల‌గించడంలో స‌హాయప‌డుతుంది. అలాగే సాయంత్రం పూట పండ్ల ర‌సాల‌ను తీసుకోవాలి. అలాగే ఉప్మా, దోశ‌, ఇడ్లీ వంటి వాటిని కాకుండా మొల‌కెత్తిన విత్త‌నాల‌ను ఆహారంగా తీసుకోవాలి. అలాగే మ‌ధ్యాహ్నం అన్నానికి బ‌దులుగా రెండు పుల్కాల‌ను తీసుకోవాలి. ఆకుకూర‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఇక సాయంత్రం 7 గంట‌ల లోపు ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా కేవ‌లం పండ్ల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోకి కొలెస్ట్రాల్ అద‌నంగా చేరకుండా ఉంటుంది. క్ర‌మంగా శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా క‌రిగిపోతుంది. ఈ విధమైన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో కూడా రాకుండా ఉంటుంది.

Share
D

Recent Posts