Chiranjeevi : అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం.. పుష్ప. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేశారు. దీంతో పుష్ప సినిమాకు ఊహించని రీతిలో హిందీ ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే పుష్ప సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఇతర తెలుగు సినిమా మేకర్స్ కూడా తమ సినిమాలను హిందీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే త్వరలో ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ మూవీలు హిందీలో విడుదల కానున్నాయి.
ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆచార్య సినిమాను కూడా హిందీలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే తెలుగుతోపాటు హిందీలోనూ ఆచార్య మూవీని విడుదల చేయాలని చూస్తున్నారు.
కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఉన్నారు. మరోవైపు దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టులో నటిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ముగిశాక చరణ్ నేరుగా ఆచార్య ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారు. ఇక ఇప్పటికే పెన్ ఇండియా ఆచార్య హిందీ హక్కులను కొనుగోలు చేసింది. దీంతో మెగాస్టార్ సినిమా హిందీలోనూ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఆచార్య హిందీలో కూడా విడుదల కానుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో విడుదల కావల్సి ఉంది. కానీ మూడేళ్ల నుంచి వాయిదా వేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరంజీవి పక్కన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్ పక్కన పూజా హెగ్డె నటించింది.