Electric Bike : మీ హీరో బైక్‌ను ఈ విధంగా సుల‌భంగా ఎల‌క్ట్రిక్ బైక్‌గా మార్చుకోండి..!

Electric Bike : ప్ర‌స్తుత త‌రుణంలో పెట్రోల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. రానున్న రోజుల్లో పెట్రోల్ రేట్లు ఇంకా పెరుగుతాయ‌నే అంటున్నారు త‌ప్ప త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌ని తెలుస్తోంది. దీంతో అంద‌రూ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోలుపై ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే పెట్రోల్ వాహ‌నాల‌ను వాడుతున్న వారు కూడా దిగులు చెందాల్సిన ప‌నిలేదు. వారు కూడా త‌మ వాహ‌నాల‌ను ఎల‌క్ట్రిక్ మోడ‌ల్స్ గా మార్చుకోవ‌చ్చు. ముఖ్యంగా హీరో బైక్‌ల‌ను చాలా సుల‌భంగా ఎల‌క్ట్రిక్ బైక్‌లుగా మార్చుకోవ‌చ్చు. అందుకు గాను ప్ర‌త్యేక ఎల‌క్ట్రిక్ క‌న్వ‌ర్ష‌న్ కిట్ లు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి.

ప్ర‌ముఖ బైక్ ఎల‌క్ట్రిక్ క‌న్వ‌ర్ష‌న్ కిట్ త‌యారీ సంస్థ గోగోఏ1 (GoGoA1) అనేక బైక్‌ల‌కు గాను ఎల‌క్ట్రిక్ కన్వ‌ర్ష‌న్ కిట్‌ల‌ను రూపొందించి విడుద‌ల చేస్తోంది. అందులో భాగంగానే హీరో Splendor బైక్‌కు ఈ కంపెనీ తాజాగా కిట్‌ను విడుద‌ల చేసింది. దీని ధ‌ర రూ.44,486గా ఉంది. ఇక బ్యాట‌రీ ప్యాక్ ధ‌ర రూ.55,606గా ఉంది. ఈ క్ర‌మంలో మీ వ‌ద్ద ఉన్న హీరో Splendor బైక్‌ను ఎల‌క్ట్రిక్ బైక్‌గా మార్చుకోవాలంటే.. అందుకు రూ.1 ల‌క్ష పైనే అవుతుంది. అయితే దీని వ‌ల్ల పెట్రోల్ కొట్టించాల్సిన ప‌నిలేదు. ఇంధ‌నం ఖ‌ర్చు పూర్తిగా తొల‌గిపోతుంది. క‌నుక అంత ఖ‌ర్చు పెట్టినా.. దీంతో సుదీర్ఘ‌కాలంలో ఎక్కువ ప్ర‌యోజ‌న‌మే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

convert your two wheeler into Electric Bike in this simple method
Electric Bike

ఇక ఈ కిట్ ద్వారా బైక్‌ను ఎల‌క్ట్రిక్ బైక్‌గా మారిస్తే అందులో హ‌బ్ మోటార్‌, రీజ‌న‌రేటివ్ కంట్రోల‌ర్‌, థ్రోటిల్‌, డ్ర‌మ్ బ్రేక్‌, బ్యాట‌రీ ఎస్‌వోసీ, వైరింగ్ హార్ నెస్‌, యూనివ‌ర్స‌ల్ స్విచ్‌, కంట్రోల‌ర్ బాక్స్‌, స్వింగ్ ఆర్మ్‌, డీసీ టు డీసీ క‌న్వ‌ర్ట‌ర్‌, యాంటీ థెఫ్ట్ డివైస్ వ‌స్తాయి. అలాగే ఈ కిట్ ద్వారా బైక్ గంట‌కు గ‌రిష్టంగా 75 నుంచి 80 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్ల‌గ‌ల‌దు. బ్యాటరీ ప్యాక్‌లో 72 వోల్టుల 40యాంప్ అవ‌ర్ లిథియ‌మ్ అయాన్ బ్యాట‌రీ ఉంటుంది. అయితే బ్యాట‌రీ ప్యాక్‌కు రూ.55వేలు ఖ‌ర్చు పెట్టొద్ద‌నుకుంటే వాటిని రెంట్ కు కూడా ఇస్తారు. ఇక ఒక‌సారి ఈ బ్యాట‌రీని పూర్తిగా చార్జింగ్ చేస్తే ఈ కిట్ ద్వారా Splendor బైక్‌పై 120 కిలోమీట‌ర్ల వ‌ర‌కు వెళ్ల‌వ‌చ్చు. రోజూ అధిక భాగం వాహ‌నాల‌పై ప్ర‌యాణించేవారికి ఈ విధంగా బైక్‌ను ఎల‌క్ట్రిక్ మోడ‌ల్‌గా మార్చుకుంటే దాంతో ఇంధ‌న ఖ‌ర్చులు ఎంత‌గానో త‌గ్గుతాయి.

ఇక గోగోఎ1 కంపెనీ ప‌లు ఇత‌ర ద్విచ‌క్ర వాహ‌నాల‌కు కూడా ఎల‌క్ట్రిక్ క‌న్వ‌ర్ష‌న్ కిట్‌ల‌ను రూపొందించి విక్ర‌యిస్తోంది. క‌నుక ఆ కంపెనీ స్టోర్‌ల‌ను సంప్ర‌దిస్తే మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

Editor

Recent Posts