Samantha : సోషల్ మీడియాలో ప్రస్తుతం సమంత చాలా బిజీగా ఉంది. ఆమె నటించిన శాకుంతలం సినిమాలో శకుంతలగా ఆమె ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. అందులో ఆమె దేవకన్యలా ఉందని చాలా మంది కితాబిచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కాసేపు తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా కొందరు ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఓపిగ్గా సమాధానాలు చెప్పింది.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన లైవ్ చాట్‌లో భాగంగా.. ఓ నెటిజన్.. నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందని అడిగాడు. అందుకు ఆమె బదులిస్తూ.. సవాళ్లను ఎదుర్కొనే సమయంలో ధైర్యం వస్తుంది.. అని చెప్పింది. ఇక ఇంకో నెటిజన్ ప్రశ్నిస్తూ.. నువ్వు ఎప్పుడైనా పిల్లల్ని కన్నావా.. అని పరోక్షంగా అడిగాడు. అందుకు ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. నీకసలు reproduce అనే పదాన్ని ఎలా వాడాలో తెలియదు, నన్ను ఆ ప్రశ్న ఎలా అడుగుతున్నావు ? అంటూ బదులు చెప్పింది.
ఇక ఇంకో నెటిజన్ మరో ప్రశ్న అడిగాడు. ఇప్పటి జనరేషన్‌కు నువ్వు ఇచ్చే సందేశం ఏమిటి ? అని అడగ్గా.. అందుకు సమంత బదులిస్తూ.. వెంట వెంటనే ఏదో ఒకటి చెయ్యకు, కాసేపు ఆలోచించు.. అని సమాధానం చెప్పింది. అలాగే మీకు భవిష్యత్తులో ఏదైనా సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరిక ఉందా.. అడిగ్గా.. నేను ఇప్పటికే చాలా నేర్చుకున్నా, అవకాశం వస్తే.. నో అని మాత్రం చెప్పను.. అని బదులు చెప్పింది.
ఇక సమంత ప్రస్తుతం కేరళలో వెకేషన్‌లో ఉంది. ఈ మధ్యే అక్కడి వాటర్ ఫాల్స్ దగ్గర ఆమె ఎంజాయ్ చేయగా.. తరువాత తన్న ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌లో సందడి చేసింది. సమంత నటిస్తున్న శాకుంతలం సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుండగా.. త్వరలో ఈమె నటించిన కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ మూవీ విడుదల కానుంది.