Veg Pulao : ఒక్క చుక్క నూనె లేకుండా వెజ్ పులావ్‌ను ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌ది..!

Veg Pulao : సాధారణంగా మ‌నం రోజూ చేసే వంట‌ల్లో నూనెను ఉప‌యోగిస్తుంటాం. ఇక పులావ్ లాంటి వంట‌కాల‌కు అయితే నూనె అధికంగా అవ‌సరం అవుతుంది. కానీ ఒక్క చుక్క నూనె కూడా ఉప‌యోగించ‌కుండా వెజ్ పులావ్‌ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇందులో నూనె వాడ‌రు క‌నుక చాలా ఆరోగ్య‌క‌ర‌మైన‌ది కూడా. క‌నుక వెజ్ పులావ్‌ను ఎలా త‌యారు చేయాలో.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.

cook Veg Pulao without oil healthy food
Veg Pulao

వెజ్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – రెండు క‌ప్పులు, పొడ‌వుగా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, పొడ‌వుగా త‌రిగిన ప‌చ్చి మిర్చి ముక్క‌లు – పావు క‌ప్పు, పాల మీగ‌డ – 3 టీ స్పూన్స్‌, కొబ్బ‌రి పాలు – 4 క‌ప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్‌, త‌రిగిన కూర‌గాయ ముక్క‌లు – త‌గిన‌న్ని, త‌రిగిన ట‌మాట ముక్కలు – పావు క‌ప్పు, ఉప్పు – రుచికి స‌రిప‌డా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా.

మ‌సాలా దినుసులు..

సాజీరా – అర టీ స్పూన్‌, ల‌వంగాలు – 5 , యాలకులు – 4, దాల్చిన చెక్క – 2 చిన్న ముక్క‌లు, యాల‌కులు – 6, అనాస పువ్వు – 1.

వెజ్ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా బియ్యాన్ని క‌డిగి నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక కుక్క‌ర్ లో మ‌సాలా దినుసులు వేసి కొద్దిగా వేయంచుకోవాలి. త‌రువాత పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌, ప‌చ్చి మిర్చి ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. ఇందులో నూనెకు బ‌దులుగా పాల మీగ‌డ వేసి క‌లుపుకోవాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ వేసిన త‌రువాత అడుగు మాడ‌కుండా ఉండ‌డానికి ఒక టేబుల్ స్పూన్ నీళ్ల‌ను పోసి, క‌లిపి, మూత పెట్టి త‌క్కువ మంట‌పై ఉడికించుకోవాలి. ఇందులో 5 నిమిషాల త‌రువాత కూర‌గాయ‌ల ముక్క‌ల‌ను, ట‌మాట ముక్క‌ల‌ను, రుచికి స‌రిప‌డా ఉప్పును, త‌రిగిన కొత్తిమీర‌, పుదీనాలను వేసి బాగా కలిపి, మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మ‌నం తీసుకునే బియ్యానికి రెండు రెట్లు ఎక్కువగా కొబ్బ‌రి పాల‌ను (4 క‌ప్పులు) పోసి.. క‌లిపి, మ‌ధ్య‌స్థ మంటపై పాల‌ను మ‌రిగించుకోవాలి.

కొబ్బ‌రి పాలు మ‌రిగిన త‌రువాత నాన‌బెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు కుక్క‌ర్ పై మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంటపై ఉడికించుకొని స్ట‌వ్ ఆఫ్ చేయాలి. కుక్క‌ర్ మూత తీసి మ‌రో సారి బాగా క‌లుపుకోవాలి. దీంతో ఒక్క చుక్క నూనె కూడా వాడ‌కుండా చేసిన ఎంతో రుచిగా ఉండే వెజ్ పులావ్ త‌యార‌వుతుంది. ఇందులో ఉప‌యోగించిన కొబ్బ‌రి పాలను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక పెద్ద సైజులో ఉండే కొబ్బ‌రి కాయ నుండి తీసిన కొబ్బ‌రిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇందులో వేడి నీళ్ల‌ను పోసి, బాగా క‌లిపి అర గంట పాటు క‌ద‌ల‌కుండా ఉంచాలి. ఇప్పుడు ఒక శుభ్ర‌మైన వ‌స్త్రాన్ని తీసుకుని, అందులో ముందుగా క‌లిపి పెట్టుకున్న నీళ్ల‌ను పోసి, వాటి నుండి పాల‌ను పిండుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కొబ్బ‌రి పాల‌ను ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పాల‌ను పులావ్ లో వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు.. ఆరోగ్యం కూడా మీ సొంత‌మ‌వుతుంది.

Share
D

Recent Posts