Dahi Masala Curry : పెరుగుతో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..

Dahi Masala Curry : మ‌నం ప్ర‌తిరోజూ పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని నేరుగా అన్నంతో క‌లిపి తిన‌డంతో పాటు వివిధ ర‌కాల కూర‌ల్లో కూడా వాడుతూ ఉంటాం. అలాగే ర‌క‌ర‌కాల పెరుగు ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పెరుగుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెరుగుతో చేసే మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. పెరుగుతో రుచిగా మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌హీ మ‌సాలా కర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిలికిన పెరుగు – 200 గ్రా., త‌రిగిన ఉల్లిపాయ – 1, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dahi Masala Curry recipe in telugu make in this method
Dahi Masala Curry

మ‌సాలా దినుసులు..

అల్లం – రెండు ఇంచుల ముక్క‌, వెల్లుల్లి రెబ్బలు – 8, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – 10, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, వేయించి పొట్టు తీసిన ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్.

ద‌హీ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో మ‌సాలా దినుసులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ప‌సుపు, ఉప్పు, కారం, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిని 2 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించిన త‌రువాత క‌సూరి మెంతి, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. త‌రువాత అర గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి.

త‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత అంతా క‌లిసేలా మ‌రోసారి క‌లుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ద‌హీ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా పెరుగుతో కూర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts