Gongura Meal Maker Masala Curry : అచ్చం నాన్ వెజ్ రుచి వ‌చ్చేలా గోంగూర మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీని ఇలా చేయ‌వ‌చ్చు..!

Gongura Meal Maker Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గోంగూర ఒక‌టి. గోంగూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ గోంగూర‌తో మనం ప‌ప్పు, ప‌చ్చ‌డే కాకుండా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. గోంగూర‌తో సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగే కూర‌ల్లో గోంగూర మీల్ మేక‌ర్ మ‌సాలా కూర కూడా ఒక‌టి. గోంగూర‌, మీల్ మేక‌ర్ క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే గోంగూర మీల్ మేక‌ర్ మ‌సాలా కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర మీల్ మేక‌ర్ మ‌సాలా కర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోంగూర క‌ట్ట‌లు – 4 ( చిన్న‌వి), ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్, ధ‌నియాలు – 2 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క‌, యాల‌కులు – 3, జీడిప‌ప్పు – 5, మీల్ మేక‌ర్ – ఒక క‌ప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Gongura Meal Maker Masala Curry recipe in telugu make in this method
Gongura Meal Maker Masala Curry

గోంగూర మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ధ‌నియాలు, కొబ్బ‌రి ముక్క‌లు, ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, యాల‌కులు, జీడిప‌ప్పు, త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక గోంగూర‌, ప‌చ్చిమిర్చి, టమాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. గోంగూర చ‌ల్ల‌గా అయిన త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. ఇందులో మీల్ మేక‌ర్ లను వేసి నాన‌బెట్టుకోవాలి. మీల్ మేక‌ర్ నానిన త‌రువాత వాటిని చేత్తో గ‌ట్టిగా పిండుతూ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, మిక్సీ ప‌ట్టుకున్న గోంగూర‌, ఉప్పు, కారం, ప‌సుపు, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు క‌లుపుతూ వేయించాలి. గోంగూర‌ను చ‌క్క‌గా ఉడికించిన త‌రువాత మీల్ మేక‌ర్, నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ త‌యారవుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూర‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. గోంగూర‌తో ఈ విధంగా చేసిన మ‌సాలా కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts