technology

ప్ర‌పంచంలోనే తొలిసారిగా డిజిట‌ల్ కండోమ్ లాంచ్.. ఇది ఎలా ప‌ని చేస్తుంది..?

సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో ప్ర‌జలు ఆన్‌లైన్‌లో ఏది చేయాల‌న్నా వ‌ణికిపోతున్నారు. బెడ్రూం కార్యకలాపాలు కూడా బ‌ట్ట‌బ‌య‌లు అవుతున్నాయి. మధురంగా ఉండాల్సిన ఏకాంత క్షణాలు న‌డిరోడ్డున ప‌డుతున్నాయి. ఇక ఆ చింత అక్క‌ర్లేదు. రివెంజ్ పార్న్ పేరిట కావాలనే కొందరు తమ ప్రేయసీ ప్రియులతో సన్నిహితంగా ఉన్న క్షణాలను రికార్డు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. కొందరు సంభాషణలను గుట్టుచప్పుడు కాకుండా రికార్డు చేస్తున్నారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు జర్మన్ హెల్త్ బ్రాండ్ బిల్లీ బాయ్ ఓ యాప్‌ను ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ యాప్ వాడకం కండోమ్ వినియోగించినంత సులువని ఓ ట్యాగ్ కూడా ఉండటంతో జనాలు దీన్ని ‘డిజిటల్ కండోమ్’ అంటూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.

ప్రైవేట్ సమయాల్లో ప్రైవసీని కాపాడేందుకు రూపొందించిన డిజిటల్ కండోమ్ యాప్ ఇది. అంటే మీ అనుమతి లేకుండా ఎదుటివ్యక్తి కాల్ రికార్డ్ చేయలేరు. మీ వాయిస్ కూడా రికార్డ్ చేయలేరు. ఒక వేళ ట్రై చేస్తే.. మీకు అలర్ట్ వస్తుంది. చాలా మంది.. వీడియో కాల్‌లో ఉన్నప్పుడు ప్రైవేట్ వీడియోలు రికార్డు చేస్తుంటారు. తర్వాత ఇబ్బందులు పెడతారు. ఇక అలాంటివి ఈ యాప్ వాడే ఫోన్‌లో కుదరవు.ఈ యాప్‌ను క్యామ్డోమ్ అని కూడా పిలుస్తారు. అనుమతి లేకుండా వీడియో లేదా ఆడియో కంటెంట్ రికార్డింగ్‌ను ఆపేందుకు బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి దీనిని వాడాలి. ఈ యాప్ స్మార్ట్ ఫోన్ కెమెరా, మైక్రోఫోన్‌ను నిలిపివేస్తుంది. ఇది మీ వ్యక్తిగత గోప్యతను కాపాడుతుంది. వీడియో, ఆడియో ఎదుటివ్యక్తి రికార్డు చేయలేరు.

digital condom launched for the first time how it works

ఏకాంతంలో మనకు తెలియకుండా ఆ సీన్లను వీడియోలు, ఫొటోలు తీయడం, ఆడియోను రికార్డు చేయడం జరగదని బిల్లీబాయ్‌ పేర్కొంది. ఈ యాప్‌ను 30 దేశాల్లో విడుదల చేశారు. ఇది బ్లూటూత్‌ సాంకేతికతతో సమీపంలోని స్మార్ట్‌ఫోన్లను నిర్వీర్యం చేసి ఏకాంతాన్ని ఆహ్లాదంగా మారుస్తుంది. ఎవరైనా వీడియోలు, ఫొటోలు తీయాలనుకున్నా కమ్‌డోమ్‌ యాప్‌ వెంటనే రియాక్ట్‌ అవుతుంది. అలారం మోగి యూజర్లను అప్రమత్తం చేస్తుంది. డిజిటల్ కండోమ్ లాంచ్ అయినప్పటి నుండి ఇది ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. కొంతమంది దీనిని ప్రశంసిస్తున్నారు, మరికొందరు దీనిని పనికిరాని ఆవిష్కరణగా చెబుతున్నారు.ఈ యాప్ ఉపయోగించడం చాలా సులభమని, ఇది ప్రజల గోప్యత, భద్రతకు భరోసా ఇస్తుందని బిల్లీ బాయ్ చెప్పారు. దీన్ని ఉపయోగించడానికి యూజర్ యాప్‌ను ఆన్ చేసి వర్చువల్ బటన్‌ను స్వైప్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ కెమెరా, మైక్రోఫోన్ ఆఫ్ అవుతాయి.ఈ యాప్ బ్లూటూత్ ఆధారంగా పని చేస్తుంది. యాప్‌ను స్వైప్ చేసి యాక్టివేట్ చేయాలి. ఈ కారణంగా కెమెరా, మైక్రోఫోన్ ఏ విషయాన్ని రికార్డు చేయకుండా యాప్ అడ్డుకుంటుంది.

Sam

Recent Posts