Dil Raju : 50 ఏళ్ల వ‌య‌స్సులో మ‌ళ్లీ తండ్రి కాబోతున్న నిర్మాత దిల్ రాజు..!

Dil Raju : టాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాత‌గా దిల్ రాజుకు ఎంతో పేరుంది. ఈయ‌న త‌న కెరీర్‌ను సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభించారు. త‌రువాత నిర్మాత అయ్యారు. ఈ క్ర‌మంలోనే అనేక హిట్ చిత్రాలను ఈయ‌న నిర్మించి స‌క్సెస్ బాట ప‌ట్టారు. టాలీవుడ్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ నిర్మాత ఎవ‌రు ? అని ప్ర‌శ్నిస్తే.. మ‌న‌కు ముందుగా దిల్ రాజు పేరే గుర్తుకు వ‌స్తుంది. ఇక ఈయ‌న త‌న‌.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిత్రాల‌ను నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈయ‌న టాలీవుడ్ లో అత్య‌ధిక స‌క్సెస్‌ను సాధిస్తున్న నిర్మాతల్లో టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతున్నారు.

Dil Raju yet again becoming father in his 50s
Dil Raju

దిల్ రాజ్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌ను నిర్మిస్తున్నారు. నిర్మాత‌గా త‌న‌కు 50వ సినిమా.. రామ్ చ‌ర‌ణ్ కు 15వ సినిమాను ఈయ‌న నిర్మిస్తున్నారు. దీనికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఈయ‌న వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే.. ఈయ‌న మొద‌టి భార్య అనిత 2017లో ఆక‌స్మికంగా మృతి చెందారు. దీంతో ఈయ‌న తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయారు. అయితే కుమార్తె హ‌న్షిత రెడ్డి బ‌లవంతం చేయ‌డంతో దిల్ రాజు మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో దిల్ రాజు.. వైగా రెడ్డి అనే మ‌హిళ‌ను వివాహం చేసుకున్నారు.

ఇక దిల్ రాజు కుమార్తె హ‌న్షిత రెడ్డికి ఇది వ‌ర‌కే వివాహం జ‌ర‌గ్గా.. ఆమెకు మేన‌స్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే తాజాగా తెలుస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. దిల్ రాజు కూడా త్వ‌ర‌లో తండ్రి కానున్నారు. వైగా రెడ్డి గ‌ర్భంతో ఉన్న‌ద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 50 ఏళ్ల వ‌య‌స్సులో ఈయన మ‌ళ్లీ తండ్రి అవుతుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఇక త్వ‌ర‌లోనే ఈయ‌న త‌న కుటుంబంలోకి ఓ కొత్త మెంబ‌ర్‌ను ఆహ్వానించ‌నున్నారు.

Admin

Recent Posts