Samsung Galaxy A53 5G : అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన శాంసంగ్ గెలాక్సీ ఎ53 5జి స్మార్ట్ ఫోన్‌..!

Samsung Galaxy A53 5G : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ భార‌త్‌లో గెలాక్సీ ఎ53 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ప్రీమియం మిడ్ రేంజ్‌లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

Samsung Galaxy A53 5G smart phone launched
Samsung Galaxy A53 5G

శాంసంగ్ గెలాక్సీ ఎ53 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను ల‌భిస్తుంది. అలాగే ఈ డిస్‌ప్లే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్య‌మైన దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు. ఈ ఫోన్‌లో శాంసంగ్ కు చెందిన ఎగ్జినోస్ 1280 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్‌ను విడుద‌ల చేశారు. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌రకు పెంచుకోవ‌చ్చు.

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్ ఉంది. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉండ‌గా.. దీనికి తోడు అద‌నంగా మ‌రో 12 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, 5 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. శాంసంగ్ పే, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్‌, ఐపీ 67 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. ఇక ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండ‌గా.. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తోంది. అందువ‌ల్ల ఫోన్ చాలా వేగంగా చార్జింగ్ అవుతుంది. అయితే ఈ ఫోన్‌కు చార్జర్‌ను మాత్రం ఇవ్వ‌డం లేదు.

శాంసంగ్ గెలాక్సీ ఎ53 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.34,499 ఉండ‌గా.. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.35,999 ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 25వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు. ప్రీ ఆర్డ‌ర్ల‌ను ప్రారంభించేశారు. ఇక లాంచింగ్ ఆఫ‌ర్ కింద ఏదైనా బ్యాంక్ నుంచి ఫైనాన్స్ తీసుకుని ఫోన్ కొంటే రూ.3000 వర‌కు క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది.

Share
Editor

Recent Posts