Dimple Hayati : డింపుల్ హ‌య‌తికి కొత్త స‌మ‌స్య‌.. ఆ కాల్స్‌, మెసేజ్‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి..!

Dimple Hayati : మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా.. డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. ఖిలాడి. ఈ మూవీ మొద‌టి రోజు మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నా.. త‌రువాత బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌ప‌డింది. దీంతో క‌లెక్ష‌న్స్ రావ‌డం క‌ష్టంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ యావ‌రేజ్ అనే టాక్ తెచ్చుకున్నా.. ఇందులో న‌టించిన డింపుల్ హ‌య‌తికి మాత్రం మూవీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈమె గోపీచంద్ సినిమాలో న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

Dimple Hayati facing new problem says can not believe those calls
Dimple Hayati

ఇక డింపుల్ హ‌య‌తి అందాల‌ను ఆర‌బోయ‌డంలో ఏమాత్రం తగ్గ‌డం లేదు. ఖిలాడి మూవీలో ఈమె ఒక రేంజ్‌లో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అలాగే మూవీ ప్రెస్ మీట్ స‌మ‌యంలోనూ రెచ్చ‌గొట్టేలా దుస్తుల‌ను ధ‌రించి అంద‌రి చూపును త‌న వైపుకు తిప్పుకుంది. అయితే ఈ భామ‌కు తాజాగా ఓ ఇబ్బంది ఎదురైంది. అదేమిటంటే..

డింపుల్ హ‌య‌తి పేరిట ఓ వ్య‌క్తి అనేక మందికి కాల్స్ చేస్తూ టెక్ట్స్ మెసేజ్‌ల‌ను పంపిస్తున్నాడు. దీంతో డింపుల్ హ‌య‌తి దృష్టికి ఈ విష‌యం వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమె స్పందించింది. త‌న పేరిట ఎవ‌రో ఓ వ్య‌క్తి కాల్స్ చేస్తూ.. మెసేజ్ ల‌ను పంపిస్తున్నాడ‌ని.. క‌నుక స‌ద‌రు నంబ‌ర్ నుంచి ఫోన్ కాల్ వ‌స్తే స్పందించ‌వ‌ద్ద‌ని.. అత‌న్ని బ్లాక్ చేయాల‌ని.. వీలైతే పోలీసుల‌కు కంప్లెయింట్ చేయండి.. అంటూ డింపుల్ హ‌య‌తి ట్వీట్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఈమె చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Editor

Recent Posts