ఆధ్యాత్మికం

ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ఇలా చేయండి.. మీ జీవిత‌మే మారిపోతుంది..!

ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితం బాగుండాలని, లేవగానే రోజంతా కూడా బాగుండాలని, మంచి పనుల‌పై దృష్టి పెట్టి, అనుకున్న పనులు పూర్తి చేయాలని అనుకుంటారు. నిద్ర లేవగానే మీరు ఇలా కనుక చేశారంటే, మీ జీవితం మారిపోతుంది. మరి ఇక నిద్ర లేవగానే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. నిద్రలేచిన వెంటనే కళ్ళు తెరవకుండా.. రెండు చేతుల్ని బాగా రాపిడి చేసి ఆ వేడితో కళ్ళు తుడుచుకున్న తర్వాత అరచేతుల్ని కళ్ళ ముందు పెట్టుకుని ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళని తెరుస్తూ.. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి.. కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం.. అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ అరచేతుల్ని చూసుకోవాలి.

ఇలా దీనిని చదువుకుంటూ మంచం నుండి దిగిన తర్వాత ఒకసారి భూమికి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వలన అంతా మంచి జరుగుతుంది. భూదేవిని నమస్కారం చేసుకుంటున్నప్పుడు.. సముద్రవసనే దేవి పర్వతస్థానమణ్డలే, విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే.. అని చదువుకోవాలి. స్నానం చేసే ముందు కూడా మనం ఒక మంత్రాన్ని చదువుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు.. అని ఈ మంత్రాన్ని చదవాలి. స్నానం చేసే నీటిలోకి నదులన్నీ వచ్చి చేరినట్లుగా భావించాలి. నీటి రూపంలో కూడా భగవంతుడే ఉండి మన దేహాన్ని శుద్ధి చేస్తున్నాడ‌ని ఒకసారి స్మరించుకోవాలి.

do like this after wakeup your life will change

ఉపనయనం అయిన వాళ్ళు సూర్యునికి మూడుసార్లు అర్ఘ్యం ఇచ్చి య‌జ్ఞోపవీతాన్ని చేతితో పట్టుకుని దశ గాయత్రిని జపించాలి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.. అని చదువుకోవాలి. అన్నం తినేటప్పుడు కూడా ఒక శ్లోకం ఉంటుంది.

అన్నం తినే ముందు రోజూ..బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః, ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర.. ఇలా ఈ శ్లోకాన్ని చదువుకుని అన్నం తింటే ఎంతో మంచిది.

Admin

Recent Posts