ఆధ్యాత్మికం

Devotional : శుక్రవారం సాయంత్రం ఇలా చేయండి.. ఆర్థిక సమస్యలు పోయి సంపద కలుగుతుంది..!

Devotional : సాధారణంగా మన ఇంట్లో సమస్యలు తొలగిపోయి సంపద కలగాలని లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. ఇలా లక్ష్మీదేవికి పూజలు చేయటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉండి సంపద కలుగుతుందని భావిస్తాము. శుక్రవారం శుక్రుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

సాధారణంగా ప్రతి రోజూ మనం లైట్లను ఆర్పివేసి చీకటిలో పడుకుంటాము. అయితే శుక్రవారం ఒక్కరోజైనా నైరుతి దిశ వైపు లైటు వెలిగించి ఉంచాలని పండితులు చెబుతున్నారు. ఫలితంగా మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని చెబుతున్నారు. శుక్రవారం ఆవుకి పచ్చగడ్డిని తినిపించడం వల్ల మనకు కలిగే ఆర్థిక సమస్యలు, అధిక ఒత్తిడిలు తొలగిపోతాయి. శుక్రవారం మనం భోజనం చేయడానికి ముందు ఆవుకు బెల్లం అన్నం, నెయ్యి కలిపి పెట్టడం వల్ల సంపదకు కొదువ ఉండదు.

do like this on friday evening to attract wealth

అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం శుక్రవారం అమ్మవారి చిత్రపటానికి లేదా విగ్రహానికి గులాబీల మాలను సమర్పించడంవల్ల దాంపత్య జీవితంలో ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవు. ఇంకా మన జీవితంలో ఏర్పడుతున్న ఒడిదుడుకులు తొలగిపోవాలన్నా శుక్రవారం సాయంత్రం అమ్మవారికి ఐదు దీపాలను వెలిగించాలి. ఈ ఐదు దీపాలని పంచముఖ దీపం అని పిలుస్తారు. ఈ పంచముఖి దీపాన్ని వెలిగించడం వల్ల మనకు ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts