vastu

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పక్షి ఫోటో ఇంట్లో ఉంటే.. ఐశ్వర్యం మీ వెంటే..!

మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు, లేదా కష్టాలు మొదలైనప్పుడు చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఎంతో నమ్ముతారు. ఇలాంటి సమయంలో వాస్తు నిపుణుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను తెలియజేస్తూ వాటికి పరిష్కార మార్గాలను వెతుకుతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం వల్ల అనేక సమస్యలు చుట్టుముడతాయి, మరికొన్ని వస్తువులు ఉండటం వల్ల ఆర్ధికంగా ముందంజలో ఉంటామని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉండటం శుభసూచకం అంటారు. ఇక అలాంటి వాటిలో ఈ పక్షి ఫోటో ఒకటి అని చెప్పవచ్చు.

మన ఇంట్లో మనం ఎక్కువగా నివసించే లివింగ్ రూమ్ లో గోడకు ఫీనిక్స్‌ పక్షి ఉన్న ఫోటోను తగిలించడం ఎంతో శుభసూచకమని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. మన ఇంట్లో ఫీనిక్స్‌ పక్షి ఫోటో ఉండటం వల్ల ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం లభిస్తుందని తెలియజేస్తున్నారు. ఫీనిక్స్‌ పక్షి సంపదకు, ఆరోగ్యానికి చిహ్నంగా ఉంటుంది. వ్యాపారంలో వృద్ధిని కలగజేస్తుంది. వాస్తు ప్రకారం ఈ పక్షి ఫొటో ఇంట్లో ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. అన్నీ కలసి వస్తాయి.

phoenix bird photo in home very auspicious

కనుక ఎంతో శుభకరం అయినటువంటి ఈ ఫీనిక్స్‌ పక్షి ఫోటోను మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా.. నెగిటివ్ ఎనర్జీ దూరమై మన ఇంట్లో అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. మన ఇంట్లో ఏర్పడిన వాస్తు దోషాలు, ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts