ఆధ్యాత్మికం

Lord Vishnu Mantram : ఈ మంత్రం యొక్క విశిష్టత తెలుసా..? ఈ మంత్రాన్ని ఎందుకు జపించాలి..?

Lord Vishnu Mantram : ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని వల్లి వేస్తూ, ఒక ముసలి ఆయన గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మెడలో రుద్రాక్ష వేసుకున్నారు. ఆయన చదువుతుండడం వలన ఆ తరంగాలు కలిపురుషున్ని తాకాయి. ఎక్కడినుండి ఇది వస్తోందని చూస్తుంటే.. అతను జపించడము చూసి, ఆపాలని ఆ ముసలి వాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. కానీ, ఆయన చేయి వేసిన వెంటనే అర కిలో మీటర్ దూరంలో పడిపోయాడు. ఏం జరిగిందో తెలియక, ముసలి అయిన మళ్లీ మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నారు.

ఈసారి మళ్లీ ఆపబోతే, ఇంకా ఎక్కువ దూరంలో పడ్డాడు. కలి పురుషుడు గజగజ వణికిపోయాడు. చూస్తే ముసలి ఆయన. పట్టుకుని ఉంటే ఎక్కడికో వెళ్లి పడుతున్నాను నా శక్తి ఏమైనా సన్నగిల్లిందా..? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన, నా రాక ఆలస్యం అయింద..? కృష్ణుడు మాయా ప్రభావం ఇదా..? ఆ ముసలివాడు ఎవడు..? శివుడా, విష్ణువా అనుకుంటూ వెళ్తుంటే వేద వ్యాసుడు కనపడ్డాడు.

Lord Vishnu Mantram why we should read this

కలి వెంటనే, వ్యాసుడు దగ్గరికి వెళ్లి సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి అని అడిగితే, వ్యాసుడు నవ్వి ఇది నీ రాజ్యం. ఈ కలికాలం నీది. నీకు సందేహమా అని అంటాడు. ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అంటాడు. కుశలమే, నా రాజ్యంలో నేను కాక నువ్వు పాలించావు కదా..? అదిగో దూరంగా వెళుతున్నాడు. ఆ ముసలివాడు ఎవరు అని అడుగుతాడు. అదా నీ సందేహం.

ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన, విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వకుండా చూస్తుంది. పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే.. నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు అని చెప్తాడు. త్రికరణ శుద్ధిగా ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే నామాన్ని ఎవరు పటిస్తారో.. వాళ్లని కనీసం నువ్వు తాకని కూడా తాకలేవు అని చెప్తారు. ఇది ఈ మంత్రం యొక్క విశిష్టత. ఇంత మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తే, ఎంత లాభం ఉంటుందో అర్థమైంది కదా..? ఓం నమో భగవతే వాసుదేవాయ.

Admin

Recent Posts